Kakani Govardhan Reddy: మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డికి న్యాయస్థానంలో ఊరట లభించింది.పొదలకూరు ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లో గతంలో నమోదైన ఒక కేసులో గూడూరు అదనపు మేజిస్ట్రేట్ కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. కోర్టు ఆయనను ఒక లక్ష రూపాయల పూచీకత్తుతో విడుదల చేయాలని ఆదేశించింది.
ప్రస్తుతం కాకాణిపై మొత్తం అయిదు కేసులు ఉన్నట్టు సమాచారం. ఇప్పటివరకు ఒక కేసులో బెయిల్ లభించగా, మిగిలిన నాలుగు కేసుల్లో కూడా బెయిల్ కోసం ఆయన న్యాయవాదులు ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు.ఇది ఆయనకు తాత్కాలిక ఊరటగా భావించవచ్చు. మిగిలిన కేసుల్లో కూడా బెయిల్ లభిస్తే మాత్రమే ఆయనకు పూర్తిస్థాయి ఉపశమనం లభించనుంది.

