Kajol: బీ టౌన్ ఫేమస్ సీనియర్ హీరోయిన్స్ లో మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టిన వారిలో నటి కాజోల్ ఒకరు. ఈ ముద్దుగుమ్మ లస్ట్ స్టోరీస్ 2 తో మళ్ళీ బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా నిలవగా.. లేటెస్ట్ గా ‘దో పట్టీ’ సినిమాతో పలకరించారు. అయితే ఆమె గురించి ఓ షాకింగ్ న్యూస్ బాలీవుడ్ వర్గాల్లో వైరల్ గా మారింది.
కాజోల్ ఏకంగా 28.78 కోట్ల విలువ చేసే స్థలాన్ని కొనుగోలు చేసినట్టుగా తెలుస్తుంది.బాలీవుడ్ కథనాలు ప్రకారం కాజోల్ భారత్ రియాలిటీ వెంచర్స్ నుంచి అంత మొత్తం పెట్టి ఒక రిటైల్ స్థలాన్ని కొనుకున్నారట.
Also Read: Brahma Anandha: ఓటిటిలోకి బ్రహ్మ ఆనందం!
Kajol: మొత్తం 4 వేల 365 చదరపు అడుగుల స్థలాన్ని ఒకో చదరపు అడుగు 65 వేల 940 రూపాయలు చెల్లించి కేవలం తన 5 కార్ల పార్కింగ్ కోసం ఆమె కొనుగోలు చేసినట్టుగా తెలుస్తుంది. దీనితో ఈ వార్తలు సోషల్ మీడియాలో, సినీ వర్గాల్లో వైరల్ గా మారాయి. ప్రస్తుతం కాజోల్ హిందీలోనే పలు వెబ్ సిరీస్ లు సినిమాలు చేస్తున్నారు. అలాగే ఈ జూన్ 27న తన మా అనే సినిమా విడుదల కాబోతుంది.