Kajal Aggarwal: నితీష్ తివారి దర్శకత్వంలో తెరకెక్కుతున్న బాలీవుడ్ ‘రామాయణం’ సినిమా సెట్స్‌పై సందడి నెలకొంది. రణబీర్ కపూర్ రాముడిగా, సాయి పల్లవి సీతగా, యశ్ రావణుడిగా, సన్నీ డియోల్ హనుమంతుడిగా నటిస్తుండగా, తాజాగా కాజల్ అగర్వాల్ కూడా ఈ భారీ ప్రాజెక్ట్‌లో చేరారు.
ఆమె రావణుడి సతీమణి మండోదరి పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. ఇప్పటికే రకుల్ ప్రీతి సింగ్ సూర్పనకగా ఖరారైన ఈ చిత్రం, రోజుకో వార్తతో వైరల్ అవుతోంది. కాజల్ ఈ పాత్ర కోసం చర్చలు జరుపుతున్నట్లు ఫిల్మ్ సర్కిల్స్‌లో చర్చ జరుగుతోంది.
Also Read: Nayanthara: మెగా 157 జోరు.. రఫ్ఫాడించేద్దాం అంటున్న నయనతార!
రాకెట్ స్పీడ్‌తో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా బాలీవుడ్‌లో భారీ అంచనాలు సృష్టిస్తోంది. కాజల్ ఎంట్రీతో హైప్ రెట్టింపు అయింది. అధికారిక ప్రకటన రావాల్సి ఉన్నప్పటికీ, ఈ ‘రామాయణం’ భారతీయ సినిమాలో కొత్త చరిత్ర సృష్టిస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు!