WTC Final 2025: ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ (WTC) ఫైనల్లో ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా తలపడుతున్నాయి. ఇంగ్లాండ్‌లోని లార్డ్స్‌లో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకుంది, బౌలర్లు అద్భుతమైన ప్రదర్శన ఇచ్చారు. బౌలర్ల దాడికి కేవలం 212 పరుగులకే ఆస్ట్రేలియా ఆలౌట్ అయింది. ఈ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా పేసర్ కగిసో రబాడ కొత్త రికార్డును లిఖించాడు.
ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ (WTC) ఫైనల్లో ఐదు వికెట్లు తీసిన ప్రపంచంలోనే రెండవ బౌలర్‌గా చరిత్ర పుటల్లోకి ఎక్కాడు. లార్డ్స్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో టెంబా బావుమా నేతృత్వంలోని ఆఫ్రికా జట్టు తరపున అతను 15.4 ఓవర్లు బౌలింగ్ చేసి, 51 పరుగులకు ఐదు వికెట్లు పడగొట్టాడు.
ఇది కూడా చదవండి: Harbhajan Singh: ఇంగ్లాండ్‌పై టీమిండియా గెలవకపోతే.. హర్భజన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
7వ ఓవర్ 3వ బంతికి ఉస్మాన్ ఖవాజాను డకౌట్ చేయడం ద్వారా రబాడ తన ఖాతా తెరిచాడు . అదే ఓవర్ చివరి బంతికి కామెరాన్ గ్రీన్ వికెట్ తీసుకున్నాడు. ఖవాజా ఫస్ట్ స్లిప్‌లో డేవిడ్ బెడ్డింగ్హామ్కు క్యాచ్ ఇచ్చాడు. తరువాత వచ్చిన గ్రీన్ కూడా ఐడెన్ మార్క్రామ్కు క్యాచ్ ఇచ్చి వాకౌట్ అయ్యాడు. రబాడ రెండో సెషన్లో ఒక్క వికెట్ కూడా తీయలేదు. అయితే, టీ విరామం తర్వాత 3.4 ఓవర్లలో 3 వికెట్లు తీసి సూపర్ కమ్‌బ్యాక్ చేశాడు.
WTC ఫైనల్లో 5 వికెట్లు తీసిన తొలి బౌలర్ న్యూజిలాండ్ పేసర్ కైల్ జామిసన్. అతను 2021లో భారత్‌పై ఈ ఘనత సాధించాడు. మొదటి ఇన్నింగ్స్‌లో జేమిసన్ 22 ఓవర్లలో 31 పరుగులకు 5 వికెట్లు పడగొట్టాడు.
మరిన్ని స్పోర్ట్స్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి


