Kadapa

Kadapa: రిజర్వ్ ఫారెస్ట్‌లో సజ్జల టీమ్‌ పాగా దర్జాగా అటవీ భూమి కబ్జా

Kadapa: గత వైసీపీ హయాంలో కబ్జాలకు కాదేది అనర్హం… అన్న విధంగా చేసి చూపించారు. జగన్‌ హయాంలో సకల శాఖా మంత్రిగా పేరొందిన సజ్జల రామకృష్ణారెడ్డి. కడప పట్టణానికి అతి సమీపంలో వందల ఎకరాల రిజర్వ్ ఫారెస్ట్ భూములకు ఎసరు పెట్టారు. అధికారం వైసీపీ చేతిలో ఉండడంతో రెవెన్యూ, ఫారెస్ట్ అధికారులు కన్నెత్తి చూడలేదు. రిజర్వ్ ఫారెస్ట్‌లో సజ్జల రామకృష్ణారెడ్డి సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్నారు. తన తమ్ముళ్ళ పేరుతో వందల ఎకరాల రిజర్వ్ ఫారెస్ట్ భూములను కబ్జా చేయడమే కాదు వాటిని సాగు చేస్తూ కోట్ల రూపాయలు బ్యాంకుల నుంచి లోన్లు తీసుకున్నారు. సొంత జిల్లా నేత పైగా షాడో సీఎం ఇక అడ్డు ఏముంటుంది. కింది స్థాయి నాయకులు నుంచి కలెక్టరేట్ వరకు అందరు అధికారులు మమ అనిపించారు. వందల ఎకరాల రిజర్వ్ ఫారెస్ట్‌ భూములను అంటగట్టారు.

Kadapa: గత ఐదేళ్లుగా సజ్జల నడిపిన అవినీతి సామ్రాజ్యం కోటకు కూటమి ప్రభుత్వం బీటలు వచ్చేలా చేస్తొంది. అసలే గత వైసీపీ హయాంలో సీఎం తర్వాత సీఎం ఇక ఆయనకు అడ్డు ఏముంటుంది. పైగా సొంత జిల్లా ఇక ఆపేదెవరు అనుకున్నారో ఏమో ఏకంగా రిజర్వ్ ఫారెస్ట్ భూములకు ఎసరు పెట్టారు సజ్జల రామక్రిష్ణారెడ్డి… కడప శివార్లలో చింతకొమ్మదిన్నె మండలం పరిధిలో దివాకర్ ఎస్టేట్ పేరుతో ఫారెస్ట్ భూములను ఆక్రమించారు సజ్జల సోదరులు… భూమి తన తమ్ముళ్ళు దివాకర్ రెడ్డి, జనార్దన్ రెడ్డి పేరు మీద ఉన్నప్పటికి సజ్జల రామక్రిష్ణారెడ్డివే భూములు అంటున్నారు. కడప, చిత్తూరు జాతీయ రహదారి దగ్గర కావడంతో విలువ ఎక్కువ… అక్కడ చింతకొమ్మదిన్నె రెవెన్యూ పరిధిలో సజ్జల కుటుంబం 130 ఎకరాల పట్టా భూములను కొనుగోలు చేశారు.

ఇది కూడా చదవండి: Dil Raju: కేటీఆర్‌ ఇక ఆపితే మంచిదంటోన్న దిల్‌ రాజు!

Kadapa: ఆ భూమి మొత్తం ఫారెస్ట్ భూముల దగ్గర ఉండడంతో పక్కనే ఉన్న రిజర్వ్ ఫారెస్ట్ భూమిని భారీగా ఆక్రమించి తమ పేరు మీద పట్టా భూమిగా మార్చుకున్నారనే ఆరోపణలు ఇప్పుడు సంచలనం రేపుతోంది. రిజర్వ్ ఫారెస్ట్ భూములకు ఫారెస్ట్ అధికారులు ఎలా ఎన్వోసీ ఇచ్చారు. రెవెన్యూ అధికారులు ఎలా బదలాయించారనే ప్రశ్నలు ఇప్పుడు రేకిస్తున్నాయి. గత ఐదేళ్లలో తమకు అనుకూలమైన అధికారులకు పోస్టింగులు ఇచ్చి ఇష్టానుసారంగా దోచుకున్నారు. కడప శివారులో 40 ఎకరాలకుపైగా రిజర్వ్ ఫారెస్ట్ భూమిని ఆక్రమించారని ప్రాథమికంగా తెలిసిన వందల ఎకరాల భూమి ఉంటుందని అక్కడ పరిస్థితి చూస్తే మాత్రం అధికారులకు తెలిసే అవకాశం ఉంటుంది. రెవెన్యూ, ఫారెస్ట్ అధికారులు విచారణ చేపడితే మాత్రం మరో భారీ భూ కుంభకోణం వెలుగులోకి వచ్చే అవకాశం ఉంటుంది.

ALSO READ  AP Rice Mafia: D- గ్యాంగ్ లింకులు..దిమ్మతిరిగే నిజాలు

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *