Nitish kumar: ఆర్జేడీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ బీహార్ సీఎం నితీశ్ కుమార్‌కు ఆసక్తికరమైన ఆఫర్ చేశారు. నితీశ్ కుమార్ “ఇండియా కూటమి”లో చేరడానికి తలుపులు తెరిచి ఉన్నాయని, అదే విధంగా ఆయన కూడా తన గేట్లను తెరవాలని సూచించారు. “రెండు వైపులా తలుపులు తెరిస్తేనే రాకపోకలు సులభతరంగా జరుగుతాయి,” అంటూ లాలూ ప్రసాద్ పేర్కొన్నారు. ఈ ప్రకటన ద్వారా నితీశ్‌ను ఇండియా కూటమిలోకి ఆహ్వానించారు.
లాలూ ప్రసాద్ వ్యాఖ్యలపై మీడియా ప్రతినిధులు నితీశ్ కుమార్‌ను ప్రశ్నించారు. “మీరు కూటమిలోకి వస్తే స్వాగతిస్తామని లాలూ ప్రసాద్ యాదవ్ చెప్పారు కదా?” అని వారు అడగగా, నితీశ్ కుమార్ సున్నితంగా తన రెండు చేతులను జోడించి నమస్కారం చేస్తూ, చిరునవ్వుతో సమాధానమిచ్చారు.
నితీశ్ స్పందన స్పష్టత లేకుండా ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. లాలూ ప్రసాద్ ఆహ్వానం రాజకీయ అనిశ్చిత పరిస్థితులను సరికొత్త మలుపు తిప్పవచ్చని, బీహార్ రాజకీయాల్లో ఈ పరిణామం ఆసక్తికరమైన దశను సృష్టించవచ్చని అంటున్నారు.