KA Success Meet: కిరణ్అబ్బవరం నటించిన ‘క’ సినిమా దీపావళి కానుకగా ఆడియన్స్ ముందుకు వచ్చింది. ఈ సినిమాకు పాజిటీవ్ టాక్ వచ్చిన నేపథ్యంలో సక్సెస్ సెలబ్రేషన్స్ ను నిర్వహించింది యూనిట్. ఈ వేడుకలోకిరణ్ అబ్బవరంతో పాటు నయన్ సారిక, తన్వీ రామ్, నిర్మాత చింతా గోపాలకృష్ణ రెడ్డి, దర్శకులు సుజీత్-సందీప్, డిస్ట్రిబ్యూటర్ వంశీ నందిపాటి ఇతర టీమ్ మెంబర్స్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ ‘మా సినిమాకు ఘన విజయాన్ని ఈ దీపావళిని ఎంతో స్పెషల్ గా చేశారు. సినిమా బిగినింగ్, ఎండింగ్ మిస్ కావొద్దు. సినిమా చివరలో కథలోని మెయిన్ ఎస్సెన్స్ ఉంది. రోలింగ్ టైటిల్స్ వరకు సినిమా చూడండి. మా టీమ్ పర్సనల్ గా వచ్చి కలుస్తా’ అన్నారు. నమ్మిన కథ ప్రేక్షకుల ఆదరణ రూపంలో విజయాన్ని సాధించినందుకు సంతోషంగా ఉంది. కంటెంట్ బాగున్న సినిమాలు వస్తే ప్రేక్షకులు ఆదరిస్తారని చెప్పేందుకు “క” లేటెస్ట్ ఎగ్జాంపుల్ అంటున్నారు దర్శకద్వయం. అన్ని సెంటర్స్ లో 80 పర్సెంట్ ఫుల్స్ అవుతున్నాయని, 18 ప్రీమియర్స్ తో స్టార్ట్ చేస్తే 71 షోస్ కు వెళ్లింది. ఈ 71 షోస్ లో 56 షోస్ హౌస్ ఫుల్ అయ్యాయని పంపిణీదారుడు వంశీ నందిపాటి చెప్పారు. పడిన కష్టం విజయంతో మర్చిపోతున్నామని నిర్మాత ఆనందాన్ని వ్యక్తం చేశారు.