మ్యాచో మ్యాన్ గోపీచంద్, డైరెక్టర్ శ్రీను వైట్ల దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ ‘విశ్వం. సడన్ గా చడీ చప్పుడు లేకుండా డిజిటల్ స్ట్రీమింగ్ కు వచ్చేసింది. ఈ హై బడ్జెట్ ఎంటర్టైనర్ ను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, వేణు దోనేపూడి చిత్రాలయం స్టూడియోస్పై టిజి విశ్వప్రసాద్ నిర్మించగా దోనేపూడి చక్రపాణి ఈ చిత్రాన్ని సమర్పించారు. ఇందులో గోపి చంద్ కు జోడీగా కావ్యా థాపర్ నటించింది.
అక్టోబర్ 11న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ పాజిటివ్ టాక్ తెచ్చుకుని మంచి విజయం సాధించింది. టెర్రరిస్ట్ ల వల్ల దేశానికి థ్రెట్ ఏర్పడటం, వారి ప్రణాళికలు హీరో తిప్పి కొట్టడం, అందుకోసం తన ఐడెంటిటీని పక్కన పెట్టి మారు వేషంలో సీక్రెట్ మిషన్ చేయడం తరహాలో ఇప్పటికే చాలా చిన్న చిత్రాలు వచ్చాయి. ఈ సినిమా కూడా అదే తరహాలో రూపొందించినప్పటికీ శ్రీను వైట్ల మార్క్ కామెడీ ఈ సినిమాకు ప్రధాన బలం. వెన్నెల కిశోర్, సీనియర్ నరేశ్, వీటీవీ గణేశ్ నేపథ్యంలో రైలు సన్నివేశాలు ఆకట్టుకుంటాయి.
అయితే, ఈ సినిమాలో తర్వాత ఏం జరుగబోయేది ముందే మనకు తెలిసిపోతుండడం మైనస్. దీంతో ఈ సినిమా అనుకున్నంత రేంజ్ లో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. తాజగా ఈ సినిమా దీపావళి కానుకగా అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.