KA 2 Movie: కిరణ్ అబ్బవరం నటించిన ‘క’ మూవీ దీపావళి కానుకగా విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. తెలుగులో ఈ సినిమా థియేట్రికల్ గా రూ. 50 కోట్ల గ్రాస్ ను వసూలు చేసింది. గత వారం మలయాళ వర్షన్ ను దల్కర్ సల్మాన్ విడుదల చేశారు. ఇప్పుడీ సినిమా తెలుగు వర్షన్ ను ఈటీవీ విన్ ఓటీటీ స్ట్రీమింగ్ చేస్తోంది. తెలుగులోనే తొలిసారి డాల్బీ విజన్ అండ్ అట్మాస్ తో స్ట్రీమింగ్ అవుతున్న చిత్రంగా ‘క’ నిలిచింది. ఓటీటీ ప్రేక్షకులకు దీని కారణంగా థియేట్రికల్ ఎక్స్ పీరియన్స్ దక్కుతోందని ఈటీవీ విన్ ప్రతినిధి సాయికృష్ణ తెలిపారు. ఇప్పటికే ఈ సినిమా 100 మిలియన్ మినిట్స్ ను పొందిందని అన్నారు. ఓటీటీలో లభిస్తున్న ఆదరణ పట్ల చిత్ర బృందం హర్షం వ్యక్తం చేసింది. ‘క -2’ సినిమా స్క్రిప్ట్ దశలో ఉందని, దానికంటే ముందు రెండు సినిమాలు చేయబోతున్నానని కిరణ్ అబ్బవరం ఈ సందర్భంగా తెలిపారు.

