Judgement:

Judgement: లంచం కేసులో 40 ఏళ్ల త‌ర్వాత‌ తీర్పు.. ఇప్పుడు నిందితుడి వ‌య‌సు 90 ఏళ్లు

Judgement: మ‌న‌దేశంలోని చ‌ట్టాల్లో ఉన్న లొసుగుల‌ను ఆస‌రా చేసుకొని ఎంద‌రో విచ్చ‌ల‌విడితనానికి పాల్ప‌డుతున్నారు. అది ఏదైనా కావ‌చ్చు. క‌ఠిన‌మైన శిక్ష‌లు అమ‌ల‌వుతున్నా.. లైంగిక దాడులు ఆగ‌డం లేదు. లంచ‌గొండులు మితిమీరుతూనే ఉన్నారు. ఎందుకంటే ఇదిగో ఇక్క‌డ జ‌రిగిన ఓ ఘ‌ట‌నే అందుకు నిద‌ర్శ‌నం. ఓ లంచం కేసులో ఓ అధికారిపై న‌మోదైన కేసులో 40 ఏళ్ల త‌ర్వాత తీర్పు వ‌చ్చింది. అంటే పుణ్యకాలం గ‌డిచిపోయింది.

Judgement: ఢిల్లీకి చెందిన సురేంద్ర కుమార్‌కు ఇప్పుడు 90 ఏళ్ల వ‌య‌సు. ఆయ‌న‌ ఎస్‌టీసీఐలో చీఫ్ మార్కెటింగ్ మేనేజ‌ర్‌గా ప‌నిచేసి రిటైర్డ్ అయ్యారు. సురేంద్ర కుమార్ 1984లో విధుల్లో ఉండ‌గా, రూ.7,500 లంచం తీసుకుంటుండ‌గా ప‌ట్టుబ‌డ్డాడు. 19 ఏళ్ల త‌ర్వాత అత‌డికి ట్ర‌య‌ల్ కోర్టు రెండేళ్లు జైలు శిక్ష‌, రూ.15 వేలు జ‌రిమానా విధించింది.

Judgement: ట్ర‌య‌ల్ కోర్టు తీర్పుపై సురేంద్ర కుమార్ హైకోర్టుకు అప్పీల్‌కు వెళ్లాడు. 22 ఏళ్ల‌పాటు ఆ కేసు పెండింగ్‌లోనే ఉన్న‌ది. ఇప్ప‌డు ఆయ‌న రిటైర్డ్ అయ్యాడు. 90 ఏళ్ల వ‌య‌సుకు వ‌చ్చాడు. ఆయ‌న లంచం తీసుకొని 40 ఏళ్ల కాలమైంది. తాజాగా ఢిల్లీ హైకోర్టు ఈకేసుపై తీర్పునిచ్చింది. సురేంద్ర కుమార్‌కు ఒక‌రోజు జైలు శిక్ష‌ను విధించింది. కేసు విచార‌ణ‌కు 40 ఏళ్లు పట్ట‌డం బాధాక‌ర‌మ‌ని తీర్పునిచ్చిన సంద‌ర్భంగా న్యాయ‌మూర్తి పేర్కొనడం గ‌మ‌నార్హం.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *