jubliee hills By elections 2025:జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితాలపై రాష్ట్రవ్యాప్తంగానే కాకుండా, దేశవ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠ నెలకొన్నది. ముక్కోణపు పోటీ ఉన్నా, కేవలం ద్విముఖ పోటీగానే మారింది. అధికార కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ నడుమే ప్రధాన పోటీ నెలకొన్నది. పోటాపోటీ సభలతో, ఆరోపణలు-ప్రత్యారోపణలతో, హామీల వర్షంతో ఆయా పార్టీల కీలక నేతలు హోరెత్తించారు. ఎన్నికలు ముగిసి, ఫలితాల కోసం ఎదురు చూస్తున్నారు.
jubliee hills By elections 2025:ఈ నేపథ్యంలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో సగానికంటే తక్కువ ఓటింగ్ నమోదైంది. కేవలం 48.49 శాతం ఓటింగ్ పోలైంది. నవంబర్ 14న ఓట్ల లెక్కింపుతో ఎవరి భవితవ్యం ఏమిటో తేలనున్నది. ఈ ఎన్నికపై ఒక విచిత్ర పరిస్థితి నెలకొన్నది. తొలుత ప్రీ పోల్ సర్వేలో బీఆర్ఎస్ పార్టీకి ఆధిక్యత ఉన్నదని పలు సర్వే సంస్థలు తమ ఫలితాలను వెల్లడించాయి. ఎన్నికలు పూర్తవగానే ఎగ్జిట్ పోల్స్ సర్వేలో మాత్రం జాతీయ స్థాయి సర్వే సంస్థలు ఎక్కువగా అధికార కాంగ్రెస్‌కే మొగ్గు చూపాయి. కొన్ని సంస్థలే బీఆర్ఎస్ గెలుపును నిర్ధారించాయి.
jubliee hills By elections 2025:ఈ దశలో గెలుపోటములపై తీవ్ర ఉత్కంఠ నెలకొన్నది. అసలు ఓటరు నాడిని ఆయా సర్వే సంస్థలు సరిగా పసిగట్టాయా? పట్టుకున్నాయా? ఏది నిజమవుతుంది? అన్న అంశంలో సంశయం నెలకొన్నది. అసలు సర్వే సంస్థల విశ్వసనీయతపైన కూడా అనుమానాలు ఉన్నాయి. ఇటీవలే జరిగిన హర్యానా, హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల్లో సర్వే సంస్థల అంచనాలు తారుమారయ్యాయి.
jubliee hills By elections 2025:ఇక్కడ ఎగ్జిట్‌పోల్ చేసిన ఎక్కువ సర్వే సంస్థలు కాంగ్రెస్‌కే పట్టంగట్టాయి. కానీ, తెలుగు రాష్ట్రాల్లో ఎంతో విశ్వసనీయత కలిగిన కేకే స్ట్రాటజీస్, మిషన్ చాణక్య సంస్థలు మాత్రం బీఆర్ఎస్ వైపు మొగ్గుచూపాయి. మరి ఇలాంటప్పుడు ప్రజల్లో అనుమానాలు రేకెత్తడం సహజమే. అందుకే ఫలితాలు ఎలా ఉండొచ్చన్న అనుమానాలతో ఉత్కంఠగా ఎదురు చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది.
jubliee hills By elections 2025:ఇక్కడ అర్థమయ్యేది ఏమిటంటే.. ప్రచారంలో ఒకరికి, పోల్ మేనేజ్మెంట్ ఒకరికి ఓటరు మొగ్గు చూపే అవకాశం ఉంటుందా? అన్న అనుమానం కలగకమానదు. దీన్నిబట్టే ప్రీపోల్ సర్వేలు ఒకలా, ఎగ్జిట్‌పోల్ సర్వేలో మరోలా ఫలితాలు వచ్చాయి. అందుకే ఓట్ల లెక్కింపుతోనే అందరి అనుమానాలు పటాపంచెలయ్యే అవకాశం ఉన్నది.

