jubliee hills By elections 2025:బీహార్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలతోపాటే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక జరగనున్నది. ఈ రోజే (అక్టోబర్ 6) ఎన్నికల షెడ్యూల్ విడుదల కానున్నట్టు సమాచారం. ఈ ఎన్నికల్లో పోటీ చేసేందుకు రాష్ట్రంలోని నాలుగు ప్రధాన పార్టీలు ఎదురు చూస్తున్నాయి. ఎంఐఎం పార్టీ ఒకవేళ అధికార కాంగ్రెస్ పార్టీకి మద్దతిచ్చినా, వాటిలో మూడు పార్టీలు తమ అభ్యర్థులను కచ్చితంగా నిలబెడతాయి.
jubliee hills By elections 2025:జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ ఉప ఎన్నికల్లో ప్రధానంగా అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీ మధ్య పోటీ పడనున్నాయి. ఇప్పటికే బీఆర్ఎస్ తన అభ్యర్థిగా దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ సతీమణి మాగంటి సునీతాగోపీనాథ్‌ను ప్రకటించింది. కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థుల ఎంపికపై ఆచీతూచి అడుగులు వేస్తున్నాయి.
jubliee hills By elections 2025:ఈ దశలో కాంగ్రెస్ పార్టీలో తీవ్రమైన పోటీ నెలకొన్నది. అభ్యర్థి ఎంపికపై ఆ పార్టీ ముగ్గురు మంత్రులను పరిశీలకులుగా నియమించింది. వారు నియోజకవర్గంలో సమావేశాలు ఏర్పాటు చేసి అంచనాను నివేదిక రూపంలో టీపీసీసీకి అందజేసినట్టు సమాచారం. ఈ మేరకు టీపీసీసీ ముగ్గురు సభ్యులతో కూడిన జాబితాను సిద్ధం చేసి పార్టీ అధిష్టానానికి పంపినట్టు తెలిసింది. ఆ జాబితాతోపాటు మరో పేరును కూడా జతచేసినట్టు తెలుస్తున్నది.
jubliee hills By elections 2025:పోటీదారుల సంఖ్య అధికంగా ఉండటంతో కాంగ్రెస్ పార్టీ నేతలు తీవ్ర కసరత్తు చేయాల్సి వచ్చింది. ఈ మేరకు 3+1 జాబితాను సిద్ధం చేసి పంపినట్టు తెలిసింది. వారిలో ప్రధానంగా బలమైన బీసీ నేతగా నవీన్‌యాదవ్ పేరును మొదటి ప్రాధాన్యంగా ఉంచింది. అదే విధంగా కార్పొరేటర్ సీఎన్ రెడ్డి, మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ పేర్లను పరిశీలించాలని కేంద్ర అధిష్టానాన్ని కోరినట్టు తెలిసింది.
jubliee hills By elections 2025:ఈ ముగ్గురి పేర్లను అంగీకరించని పక్షంలో నాలుగో అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎంపీ అంజన్‌కుమార్ యాదవ్ పేరును జాబితాలో చివరి అవకాశంగా ఉంచినట్టు సమాచారం. ఇదిలా ఉండగా, కాంగ్రెస్ పార్టీలో ఎలాంటి మార్పులు, చేర్పులకైనా అవకాశం ఉంటుంది. అధిష్టానమే నేరుగా పరిశీలన జరిపి ఉండవచ్చు. లేదా అధిష్టానం వద్ద పైరవీ చేసుకున్న వారికీ దక్కే చాన్స్ కూడా ఉంటుంది. ఈ దశలో అధిష్టానం వద్ద ప్రాధాన్యం కలిగిన అజారుద్దీన్ లేదా అంజన్‌కుమార్ యాదవ్‌కు దక్కినా ఆశ్చర్యపోనక్కరలేదని తెలుస్తున్నది.