jubliee hills By elections 2025: జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నిక ప్రతిష్ఠాత్మకంగా మారింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అకాల మరణంతో ఖాళీ అయిన ఈ స్థానంకోసం పోటాపోటీ నెలకొన్నది. అటు అధికార పార్టీకి, ఇటు రెండు ప్రతిపక్ష పార్టీలకు జీవన్మరణ సమస్యగా మారింది. నవంబర్ 11న పోలింగ్ జరుగుతుండగా, ఇదే నెల 14న భవితవ్యం తేలనున్నది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నవీన్‌యాదవ్, బీఆర్ఎస్ అభ్యర్థిగా మాగంటి గోపీనాథ్ సతీమణి సునీతా గోపీనాథ్, బీజేపీ అభ్యర్థిగా లంకల దీపక్‌రెడ్డి బరిలో నిలిచారు. ముక్కోణపు పోటీ అనిపించినా, ప్రధానంగా బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల నడుమ ద్విముఖ పోరుగా మారింది.
jubliee hills By elections 2025: ఎన్నికల ప్రచారం ముమ్మరంగా సాగింది. కాంగ్రెస్ తరఫున సీఎం రేవంత్‌రెడ్డి, బీఆర్ఎస్ తరఫున ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, బీజేపీ నుంచి బండి సంజయ్ ప్రతిష్టాత్మకంగా ప్రచారం నిర్వహించారు. పోటాపోటీ ఉపన్యాసాలతో జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రాంతాలు వారంరోజులపాటు దద్దరిల్లిపోయాయి. అభివృద్ధి ధ్యేయంగా కాంగ్రెస్, ఆరు గ్యారెంటీల అమలులో సర్కారు వైఫల్యంపై బీఆర్ఎస్, హిందూత్వ ఎజెండాగా బీజేపీ తమ వైఖరులను ప్రదర్శించారు.
jubliee hills By elections 2025: ఈ దశలో జూబ్లీహిల్స్‌లో ఏ పార్టీ గెలుపొందినా ప్రభావం మాత్రం అధికంగా ఉంటుందని రాజీకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికలకు ఈ గెలుపోటములే పునాదిగా అన్ని పార్టీలు భావిస్తున్నాయి. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఓటమి పాలైతే అధికారంలో మార్పులు చోటుచేసుకుంటాయని భావిస్తున్నారు. సీఎం రేవంత్ పాలనపై ప్రజల్లో విశ్వసనీయ కోల్పోయినట్టుగా భావించే ప్రమాదం ఉన్నది. కీలకమైన మార్పులు, చేర్పులకు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పూనుకుంటుందని చెప్తున్నారు.
jubliee hills By elections 2025: కాంగ్రెస్ వైఫల్యాలు ఆ పార్టీని ఓడించాయని ప్రజలు కూడా భావించే అవకాశం ఉన్నది. ఈ నేపథ్‌యంలో త్వరలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికలు, వచ్చే అసెంబ్లీ ఎన్నికలపై తీవ్ర ప్రభావం ఉంటుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి ఆ ఎన్నికల్లో తీవ్రమైన దెబ్బ ఉంటుందని భావిస్తున్నారు. కాంగ్రెస్ సర్కారులో కూడా రేవంత్‌రెడ్డి నాయకత్వంపై వ్యతిరేకత వచ్చే ప్రమాదం లేకపోలేదని చెప్తున్నారు.
jubliee hills By elections 2025: గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి, లోక్‌సభ ఎన్నికల్లో ఘోర పరాభవంతో చతికిలపడిన బీఆర్ఎస్ పుంజుకోవాలంటే ఈ ఎన్నికే ప్రతిష్టాత్మకం కానున్నది. బీఆర్ఎస్ పార్టీ సిట్టింగ్ స్థానాన్ని కోల్పోతే ఆ పార్టీకి ఎదురు దెబ్బ తప్పదని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అధికార పార్టీ ఎదుర్కోవడంలో, ఆ పార్టీ వైఫల్యాలను ప్రజల్లో తీసుకెళ్లినా నమ్మలేదని తేలుతుంది. వచ్చే ఎన్నికలపైనా ఆశలు వదులుకోవాల్సిందేనని చెప్తున్నారు. ప్రజలు అభివృద్ధినే నమ్ముకున్నారని తేలుతుంది. సానుభూతి కూడా పనిచేయలేదనే విషయం తేటతెల్లం కానున్నది. ప్రధాన ప్రతిపక్ష పాత్ర మారే అవకాశమూ లేకపోలేదు.
jubliee hills By elections 2025: బీజేపీ ఓటమి పాలైతే ప్రధానంగా హిందూత్వ ఎజెండా పనిచేయదని ఆ పార్టీకి బోధపడుతుంది. అదే విధంగా రాష్ట్రంలో బీజేపీకి భవిష్యత్తు ఆశలు ప్రశ్నార్థకం కానున్నాయి. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డిపై ఇతర నేతలు వేలెత్తి చూపే అవకాశం ఉన్నది. వచ్చే ఎన్నికలపై బీజేపీ ఆశలు కూడా గల్లంతు కానున్నట్టు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

