jubliee hills By elections 2025: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కోసం బీఆర్ఎస్ అడుగులు వేగంగా పడుతున్నాయి. ప్రత్యర్థితో సంబంధం లేకుండా ముందస్తుగానే నియోజకవర్గ పరిధిలో సమావేశాలు నిర్వహిస్తూ వచ్చిన ఆ పార్టీ తాజాగా అభ్యర్థిని ప్రకటించింది. ఈ మేరకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ జూబ్లీహిల్స్ అభ్యర్థిని అధికారికంగా ప్రకటించారు. ఇప్పటికే దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ సతీమమణి సునీత పేరును సూచన ప్రాయంగా పార్టీలో విస్తృతంగా ప్రచారం చేస్తూ వచ్చింది.
jubliee hills By elections 2025: జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీకి సిట్టింగ్ స్థానం. ఇటీవల ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అకాల మరణంతో ఆ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. దీంతో అటు అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీ పోటీకి సిద్ధమవుతున్నాయి. ఈ మేరకు కాంగ్రెస్ అభ్యర్థి వెతుకులాటలో ఉన్నది. బీజేపీ కూడా అభ్యర్థి ఎన్నికకు సమాలోచనలో ఉన్నది.
jubliee hills By elections 2025: ఈ దశలో బీఆర్ఎస్ పార్టీ వ్యూహాత్మకంగా తన అభ్యర్థిని ప్రకటించింది. గత కొన్నాళ్లుగా గోపీనాథ్ సతీమణి పేరునే ప్రకటిస్తూ వచ్చింది. అయితే ఆ పార్టీలో పోటీ లేకపోయినా, గోపీనాథ్ సోదరుడు కొంత అసంతృప్తితో ఉన్నారని తెలిసింది. ఆయనను సముదాయించిన అనంతరమే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్.. సునీతను తమ పార్టీ అభ్యర్థిగా ప్రకటించారు.
jubliee hills By elections 2025: ఇప్పటికే జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంలో ప్రాంతాల వారీగా సీనియర్ నేతలను బాధ్యులుగా బీఆర్ఎస్ పార్టీ నియమించింది. సమావేశాలు నిర్వహిస్తూ వస్తున్నది. కాలనీలవారీగా సమావేశాలు ఏర్పాటు చేసి ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దిశానిర్దేశం చేశారు. బీహార్ ఎన్నికలతో పాటు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఉంటుందన్న నేపథ్యంలో బీఆర్ఎస్ ముందుగానే తేరుకుంటున్నది.