jubliee hills By elections 2025: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక భారీ నామినేషన్లకు వేదిక అయింది. గత అసెంబ్లీ ఎన్నికల అనంతరం కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టింది. రెండేండ్ల పదవీకాలం ముగియవస్తుంది. ఈ నేపథ్యంలో తొలి ఉప ఎన్నిక కావడం గమనార్హం. ఈ దశలో జరుగుతున్న ఈ ఉప ఎన్నికపై రాష్ట్రవ్యాప్తంగా, ఒకింద దేశంలో కూడా ఈ ఎన్నికకు ప్రాధాన్యం సంతరించుకున్నది.
jubliee hills By elections 2025: ఈ జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గతంలో గెలుపొందిన మాగంటి గోపీనాథ్ అకాల మరణంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. దీంతో ఈ నియోజకవర్గం ఎన్నిక సిట్టింగ్ స్థానం కావడంతో అటు బీఆర్ఎస్ పార్టీకి, అధికార పార్టీ అయిన కాంగ్రెస్ కు ప్రతిష్ఠాత్మకంగా మారాయి. ఈ రెండు పార్టీలు ఎలాగైన గెలుపొందాలని పంతాలు, పట్టింపులకు పోతున్నాయి.
jubliee hills By elections 2025: ఈ మేరకు అటు అధికార కాంగ్రెస్ పార్టీ నుంచి నవీన్‌యాదవ్, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ నుంచి దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ సతీమణి మాగంటి సునీత అదే పార్టీ నుంచి పోటీపడుతున్నారు. బీజేపీ నుంచి దీపక్‌రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. ఈ మూడు పార్టీల మధ్య ప్రధాన పోటీ ఉంటుందని భావిస్తున్నా, ముఖ్యంగా బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల నడుమ మాత్రమే తీవ్ర పోటీ ఉంటుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
రంగంలో నిలిచే అభ్యర్థులు ఎంతమందో తెలుసా?
jubliee hills By elections 2025: ఈ దశలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు అక్టోబర్ 21న నామినేషన్ల దాఖలు ఆఖరు గడువు. ఈ ఒక్కరోజే భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి. మొత్తంగా చూస్తే 321 నామినేషన్లు దాఖలయ్యాయి. ఒక్క ఆఖరు రోజే 117 మంది అభ్యర్థుల నుంచి 194 నామినేషన్లు వచ్చాయని అధికార వర్గాలు తెలిపాయి. మొత్తంగా 211 మంది అభ్యర్థులు బరిలో ఉన్నట్టు లెక్క తెలిపారు.
24వరకు నామినేషన్ల ఉపసంహరణ గడువు
jubliee hills By elections 2025: నామినేషన్ల ఉపసంహరణకు అక్టోబర్ 24 ఆఖరు గడువుగా ఉన్నది. అదే విధంగా నవంబర్ 11న పోలింగ్ ఉండగా, నవంబర్ 14న ఓట్ల లెక్కింపు జరుగుతుంది. అదే రోజు ఎన్నికల భవితవ్యం తేలనున్నది. నామినేషన్ల ఉపసంహరణ గడువు రాకముందే ఇప్పటికే ఇంటింటి ప్రచారం ఊపందుకున్నది. అధికా, ప్రతిపక్ష పార్టీల నడుమ పోటాపోటీ ప్రచారం జోరుగా సాగుతున్నది.