Jr NTR: ‘ఆర్ఆర్ఆర్’తో ప్యాన్ ఇండియా స్టార్ గా ఎదిగిన ఎన్టీఆర్ ఇటీవల ‘దేవర’గానూ ఆకట్టుకున్నాడు. ప్రస్తుతం హృతిక్ తో కలసి అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో యశ్ రాజ్ ఫిలిమ్స్ లో ‘వార్2’లో నటిస్తున్నాడు. యశ్ రాజ్ ఫిలిమ్స్ తమ సంస్థలో నటించే స్టార్స్ తో ప్రతిసారీ మూడు సినిమాల డీల్ కుదుర్చుకోవడం అలవాటు. అందులో భాగంగానే ఎన్టీఆర్ తో యశ్ రాజ్ ఫిలిమ్స్ మరో భారీ ప్రాజెక్ట్ చేయబోతోందట. ఈ మేరకు ప్రముఖ బాలీవుడ్ డైరెక్టర్ తో స్క్రిప్ట్ కూడా వినిపించారనే టాక్ వినవస్తోంది. ఈ సినిమాను 2025 చివరల్లో పట్టాలెక్కిస్తారట. దీనితో పాటు మరో సినిమా కలిపి మొత్తం మూడు సినిమాలలో నటించే విధంగా ఎన్టీఆర్ తో యశ్ రాజ్ ఫిలిమ్స్ ఒప్పందం కుదుర్చుకోనుందట. అయితే ఈ డీల్ కు ఎన్టీఆర్ ఓకె చెప్పాడా? లేదా? అనే విషయంలో క్లారిటీ లేదు. ఒక వేళ ఈ డీల్ కుదిరితే ‘దేవర2’ ఉండక పోవచ్చంటున్నారు. ఎందుకుంటే ‘వార్2’ తర్వాత ప్రశాంత్ నీల్ ‘డ్రాగన్’ సినిమా చేయనున్నాడు. ఆ తర్వాత మళ్ళీ యశ్ రాజ్ ఫిలిమ్స్ సినిమా చేయవలసి వస్తుంది. సో ‘దేవర2’ ఉండదన్న మాట. ’దేవర’ బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద 62 కోట్లకుపైగా వసూలు చేసినా తెలుగునాట కొన్ని ఏరియాల్లో వర్కవుట్ కాలేదు. మరి ఎన్టీఆర్ – యశ్ రాజ్ డీల్ విషయంలో క్లారిటీ ఎప్పుడు వస్తుందో చూద్దాం.
