KTR: తెలంగాణలో ప్రతిపక్షమైన బీఆర్ఎస్ పార్టీలో అధికార పక్షమైన కాంగ్రెస్ ముఖ్య నేతలు చేరారు. హైదరాబాద్ నగర పరిధిలోని రాజేంద్రనగర్ నియోజకవర్గ ముఖ్య నేత అయిన మణికొండ మున్సిపాలిటీకి చెందిన కాంగ్రెస్ కీలక నేత మాల్యాద్రి నాయుడు సహా పలువురు నేతలు ఆ పార్టీకి రాజీనామా చేశారు. శనివారం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ సమక్షంలో వారంతా బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి కేటీఆర్ గులాబీ కండువాలు కప్పి పార్టీలో చేర్చుకున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి, బీఆర్ఎస్ రాజేంద్రనగర్ నియోజకవర్గ నేత కార్తీక్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.