KA: వరుస పరాజయాలతో సతమతమౌతున్న కిరణ్ అబ్బవరంకు ‘క’ మూవీ కొత్త ఊపిరి పోసింది. వైవిధ్యమైన కథ, కథనాలతో తెరకెక్కిన ‘క’ను తెలుగు ప్రేక్షకులు హృదయానికి హత్తుకున్నారు. దాంతో ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లో విజయ పథంలో సాగుతోంది. దీపావళి కానుకగా విడుదలైన ‘క’ 50 కోట్ల గ్రాస్ ను వసూలు చేసిందని చిత్ర నిర్మాత చింతా గోపాల కృష్ణారెడ్డి తెలిపారు. నయన్ సారిక, తన్వీ రామ్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమాతో సుజీత్, సందీప్ దర్శకులుగా పరిచయం అయ్యారు. ఈ నెల 22న ‘క’ మలయాళ వర్షన్ ను దుల్కర్ సల్మాన్ కు చెందిన వేఫరర్ ఫిలిమ్స్ కేరళలో రిలీజ్ చేయబోతోంది.
Manam chese Manchi chedu manalni eppudu ventadutune untai 🔥#KA pic.twitter.com/BtEaH03Sk1
— Kiran Abbavaram (@Kiran_Abbavaram) November 15, 2024