Article 370: జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా (ఆర్టికల్ 370)ని పునరుద్ధరించే ప్రతిపాదనను అసెంబ్లీ ఆమోదించింది. అయితే, బీజేపీ ఎమ్మెల్యేలు దీన్ని వ్యతిరేకిస్తూ ప్రతిపాదన కాపీలను చించివేశారు. ఎమ్మెల్యేలు వెల్‌లోకి వెళ్లి నినాదాలు చేస్తూ తమ నీరసం వ్యక్తం చేశారు.
స్పీకర్ మంత్రుల సమావేశాన్ని పిలిచి తీర్మానం ముసాయిదాను స్వయంగా తయారు చేశారని బీజేపీ ఆరోపించింది. అనంతరం ఎమ్మెల్యేలు బెంచ్ ఎక్కి రచ్చ సృష్టించారు. గందరగోళం నెలకొనడంతో సభ గురువారానికి వాయిదా పడింది.
ఇది కూడా చదవండి: UP: ముగ్గురు గర్ల్‌ఫ్రెండ్స్.. గిఫ్ట్‌ల కోసం బ్యాంకుకే కన్నం…
Article 370: బీజేపీ అధ్యక్షుడు సత్ శర్మ ఆధ్వర్యంలో పార్టీ కార్యకర్తలు పార్టీ కార్యాలయంలో పెద్ద ఎత్తున చేరుకున్నారు. వారంతా జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. ఆందోళనకారులు ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా, డిప్యూటీ సీఎం సురీందర్ చౌదరి దిష్టిబొమ్మలను దహనం చేశారు.
నేషనల్ కాన్ఫరెన్స్ జమ్మూ కాశ్మీర్ ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని బిజెపి ఆరోపించింది. ఆర్టికల్ 370 మరియు 35Aలను ఏ అసెంబ్లీ తిరిగి తీసుకురాదని పేర్కొంది.