Jharkhand:

Jharkhand: ఝార్ఖండ్‌లో ఘోర రోడ్డు ప్ర‌మాదం.. 18 మంది దుర్మ‌ర‌ణం.. మ‌రో 20 మందికి గాయాలు

Jharkhand: ఝార్ఖండ్ రాష్ట్రంలో ఘోర‌ రోడ్డు ప్ర‌మాదం జ‌రిగింది. మంగ‌ళ‌వారం (జూలై 29) జ‌రిగిన‌ ఈ ప్ర‌మాదంలో బ‌స్సు ద‌హ‌న‌మై దానిలో ప్ర‌యాణిస్తున్న 18 మంది భ‌క్తులు దుర్మ‌ర‌ణం పాల‌య్యారు. ఇదే ప్ర‌మాదంలో మ‌రో 20 మందికి గాయాల‌య్యాయి. అదే రాష్ట్రంలోని దేవ‌ఘ‌డ్‌లోని బాబాధామ్‌కు చెందిన వారు డుమ్కాలోని బాసుకీనాథ్ ఆల‌యానికి క‌న్వ‌ర్ యాత్రీకులు వెళ్తుండ‌గా మార్గ‌మ‌ధ్యంలో ఈ ప్ర‌మాదం జ‌రిగింది.

Jharkhand: మంగ‌ళ‌వారం తెల్ల‌వారుజామున వెళ్త‌న్న బ‌స్సు.. ఎదురుగా వ‌స్తున్న ట్ర‌క్‌ను ఢీకొట్టింది. దానికి ఉన్న గ్యాస్ సిలిండ‌ర్ పేలి మంట‌లు చెల‌రేగాయి. ఈ మంట‌ల‌కు తాళ‌లేక 18 మంది బ‌స్సులో ఉన్న భ‌క్తులు ప్రాణాలిడిశారు. మ‌రో 20 మందికి గాయాలయ్యాయి. ఘ‌ట‌నా స్థ‌లానికి అధికారులు, సిబ్బంది చేరుకొని స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌డుతున్నారు. క్ష‌త‌గాత్రుల‌ను వివిధ ఆసుప‌త్రుల‌కు త‌ర‌లించి వైద్య చికిత్స‌లు అందిస్తున్నారు. ఈ ఘ‌ట‌న‌కు సంబంధించిన పూర్తి వివ‌రాల‌ను ఆ రాష్ట్ర ప్ర‌భుత్వం అధికారికంగా ప్ర‌క‌టించాల్సి ఉన్న‌ది.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *