Seerat Kapoor: సీరత్ కపూర్ కీలక పాత్ర పోషిస్తున్న సినిమా ‘జాతస్య మరణం ద్రువం’. నరేశ్ అగస్త్య, జేడీ చక్రవర్తి ఇందులో ప్రధాన పాత్రలను పోషించారు. శరవణ్ జొన్నాడ దర్శకత్వంలో మల్కాపురం శివకుమార్ నిర్మిస్తున్న ఈ పాన్ ఇండియా మూవీ టైటిల్ అనౌన్స్ మెంట్ పోస్టర్ జనవరి 2న వచ్చింది. గిబ్రాన్ సంగీతం అందిస్తున్న ‘జాతస్య మరణం ధ్రువం’ సైకలాజికల్ సస్పెన్స్ థ్రిల్లర్ అని మేకర్స్ తెలిపారు. తెలుగులో పాటు ఇది తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో రిలీజ్ కాబోతోంది. పదేళ్ళ క్రితం ‘రన్ రాజా రన్’ మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన శీరత్ కపూర్ గత కొంతకాలంగా మంచి విజయం కోసం ఎదురుచూస్తోంది. లాస్ట్ ఇయర్ ‘భామాకలాపం -2, మనమే, ఉషా పరిణయం’ చిత్రాలలో స్పెషల్ సాంగ్స్ లో నర్తించింది కానీ విజయమైతే ఆమెకు దక్కలేదు. మరి ఈ కాన్సెప్ట్ ఓరియంటెడ్ మూవీ అయినా సీరత్ కపూర్ ను సక్సెస్ ట్రాక్ ఎక్కిస్తుందేమో చూడాలి.
