Mohammed Siraj: గత కొంతకాలంగా ఫామ్ లేమితో సతమౌతున్న పేసర్ మహ్మద్ సిరాజ్ ..పెర్త్ టెస్టులో అనూహ్యంగా రాణించాడు. ఇలా బోర్డర్ గావస్కర్ ట్రోఫీలో తాను పుంజుకోవడం వెనక బుమ్రా సలహాలు ఎంతో ఉపయోగపడ్డాయని వివరించాడు టీమ్‌ఇండియా పేసర్ సిరాజ్. అతని సలహాతోనే వికెట్లు మళ్లీ వికెట్లు పడగొట్టానని చెబుతూ బుమ్రాకు కితాబిస్తున్నాడు.
న్యూజిలాండ్‌తో సొంత గడ్డపై జరిగిన టెస్టు సిరీస్‌లో నిరాశాజనకమైన ఆటతీరుతో టీమ్‌ఇండియా పేసర్ మహమ్మద్ తీవ్ర విమర్శల పాలయ్యాడు. కానీ తాజాగా జరుగుతున్న బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ లో తన సత్తా చాటాడు. పెర్త్ లో ముగిసిన తొలి టెస్టు లో ఆస్ట్రేలియాపై మొత్తం 5 వికెట్లు తీసి ఆకట్టుకున్నాడు. తాను పుంజుకోవడం వెనక స్టార్ పేసర్ బుమ్రా ఉన్నాడని.. ఈ క్రెడిట్ అంతా అతడికే దక్కుతుందని వివరిస్తున్నాడు. సొంత గడ్డపై న్యూజిలాండ్‌తో 0-3 తేడాతో వైట్‌వాష్ అయిన టెస్టు సిరీస్‌లో సిరాజ్ రెండు వికెట్లు మాత్రమే తీశాడు. ఆసీస్ పర్యటనలో తొలి టెస్టు కెప్టెన్, స్టార్ పేసర్ బుమ్రా ఇచ్చిన సలహాలు తనకు ఎంతో ఉపయోగపడ్డాయని తెలిపాడు తొలి మ్యాచ్‌కు ముందు బుమ్రాతో మాట్లాడగా అతను వికెట్ల కోసమే చూడకు. ఒకే ప్రాంతంలో నిలకడగా బంతులు వేయడానికి ప్రయత్నించు.
ఇది కూడా చదవండి: WTC 2025: రసవత్తరంగా వరల్డ్ టెస్టు చాంపియన్ షిప్..ఫైనల్ బెర్తుల కోసం పోటీ పడుతున్న ఐదు జట్లు
Mohammed Siraj: బౌలింగ్‌ను ఆస్వాదించు. అప్పటికీ ఇంకా వికెట్లు దక్కకపోతే.. మళ్లీ నా దగ్గరికి రా అంటూ భుజం తట్టి భరోసా ఇచ్చాడన్నాడు. దీంతో నా బౌలింగ్‌ను మార్చుకుని వికెట్లు తీసానన్నాడు సిరాజ్. మాజీ బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్ కూడా తనకు సలహాలు ఇచ్చాడని.. అతడు తన బౌలింగ్‌ను ఎంతోకాలం నుంచి గమనిస్తున్నాడని సిరాజ్ తెలిపాడు. పెర్త్ టెస్టులో టీమ్‌ఇండియా తొలి ఇన్నింగ్స్‌లో 150 పరుగులకే కుప్పకూలినా.. ఆ తర్వాత అద్భుతంగా పునరాగమనం చేసింది. ప్రత్యర్థి జట్టును తొలి ఇన్నింగ్స్‌లో 104 పరుగులకే ఆలౌట్ చేయడంలో బుమ్రా నేతృత్వంలోని పేసర్లు కీలక పాత్ర పోషించారు. బుమ్రా 5 వికెట్లు తీయగా.. సిరాజ్ రెండు వికెట్లు పడగొట్టాడు. ఇక ఆసీస్ రెండో ఇన్నింగ్స్‌లో బుమ్రా, సిరాజ్ చెరో మూడు వికెట్లు తీసి.. ఆసీస్‌ను వారి సొంతగడ్డపైనే మట్టికరిపించడంలో కీలక పాత్ర పోషించారు. ఆ తర్వాత ఆస్ట్రేలియా పీఎం ఎలెవన్‌తో జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్‌లోనూ సిరాజ్ ఆకట్టుకున్నాడు. ఇందులో భారత్ 6 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది.