Gadar 3: సన్నీ దేవోల్, అమీషా పటేల్ జంటగా రూపుదిద్దుకున్న ‘గదర్’ మూవీ 2001లో విడుదలై ఘన విజయాన్ని సాధించింది. దేశభక్తిని ప్రేరేపించే ఈ చిత్రంలో తన ఫెరోషియస్ యాక్షన్ తో సన్నీ మాస్ ఆడియెన్స్ ను మెప్పించాడు. విశేషం ఏమంటే గత యేడాది ఈ సినిమాకు సీక్వెల్ గా ‘గదర్ -2’ విడుదలైంది. 60 కోట్ల రూపాయల బడ్జెట్ తో రూపుదిద్దుకున్న ఈ సినిమా ఎవరూ ఊహించని విధంగా 500 కోట్లను కలెక్ట్ చేసింది. దాంతో ఈ సినిమాకు కూడా సీక్వెల్ వస్తుందనే ప్రచారం జరిగింది. ‘గదర్ -2’ చిత్ర దర్శకుడు అనిల్ శర్మ పైతం ఈ విషయాన్ని ధృవీకరించారు. ప్రస్తుతం ‘వనవాస్’ మూవీ ప్రమోషన్స్ తో బిజీగా ఉన్న ఆయన… ‘గదర్ -3’ మూవీ ఉంటుందని, దానికి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ జరుగుతోందని తెలిపారు. అయితే నానా పటేకర్ ఈ సినిమాలో విలన్ గా కనిపిస్తారని వచ్చిన వార్తల గురించి ఆయన క్లారిటీ ఇవ్వలేదు. నానా పటేకర్ ను కలిసిన మాట వాస్తవమేనని, ఆయన ఈ ప్రాజెక్ట్ లో లేదా వేరే ఏ ప్రాజెక్ట్ లో అయినా ఉంటారని అనిల్ శర్మ తెలిపారు.
