Jani Master: లైంగిక వేధింపుల కేసులో రిమాండ్ లో ఉన్న కొరియోగ్రాఫర్ జానీకి నేషనల్ అవార్డ్ కమిటీ షాక్ ఇచ్చింది. అతనికి వచ్చిన నేషనల్ అవార్డ్ ను నిలిపివేసింది. జానీ మాస్టర్ పై ఫోక్సొ కేసు నమోదు కావడంతో అవార్డు కమిటీ ఈ నిర్ణయం తీసుకుంది. జానీ మాస్టర్ కు ధనుష్ నటించింన తిరుచిట్రంబలం తమిళ సినిమాలోని పాటకు గాను ఉత్తమ కొరియోగ్రాఫర్‌గా నేషనల్ అవార్డు గతంలో ప్రకటించారు.
Also Read: హోమ్ లోన్ తీసుకుంటున్నారా? కచ్చితంగా ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే!
Jani Master: ఈ నెల 8 న ఢిల్లీలో జరగబోయే ఫంక్షన్ లో అవార్డు తీసుకోవాల్సి ఉంది. ఇందుకోసం రిమాండ్ లో ఉన్న జానీ మాస్టర్ కు రంగారెడ్డి జిల్లా కోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చింది. ఇప్పుడు అవార్డు రద్దయిన నేపధ్యంలో జానీ మాస్టర్ మధ్యంతర బెయిల్ రద్దయ్యే అవకాశం కనిపిస్తోంది.

