Jammu Kashmir: జమ్మూ కశ్మీర్‌లోని కిష్త్‌వార్ జిల్లాలో క్లౌడ్‌బరస్ట్ సంభవించి విషాదం మిగిలింది. ఈ ఘటనలో 22 మంది ప్రాణాలు కోల్పోయారు. మచైల్ మాత యాత్రలో పాల్గొన్న భక్తుల టెంట్లు ఆకస్మిక వరదల ప్రవాహంలో కొట్టుకుపోయాయి. భారీ నీటి ప్రవాహం కారణంగా యాత్రను అధికారులు తక్షణమే నిలిపివేశారు.
రక్షణ బృందాలు సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు ముమ్మరం చేశాయి. వరద నీటిలో కొట్టుకుపోయిన వారిని వెతికే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
ఈ ఘటనపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా జమ్మూ కశ్మీర్ సీఎం, లెఫ్టినెంట్ గవర్నర్‌లకు ఫోన్ చేసి సమాచారం తీసుకున్నారు. సహాయక చర్యలను వేగవంతం చేయాలని, అవసరమైన సహాయం అందించేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని ఆయన భరోసా ఇచ్చారు.