Avatar 3: అవతార్ చిత్రంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినిమా ప్రేమికులను ఓ సరికొత్త ప్రపంచంలోకి తీసుకెళ్ళారు జేమ్స్ కామెరూన్. అవతార్ మాత్రమే కాదు ఆ తర్వాత దాని సీక్వెల్ గా వచ్చిన అవతార్-2 సైతం చక్కని విజయాన్ని అందుకుని ఆ సీరిస్ పై ప్రేక్షకులు పెట్టుకున్న నమ్మకాన్ని మరింత పెంచేలా చేసింది. ప్రస్తుతం జేమ్స్ కామెరూన్ అవతార్ – ఫైర్ అండ్ యాష్ మూవీ తెరకెక్కించే పనిలో ఉన్నారు.
అవతార్-2 తరువాత వస్తున్న “అవతార్-3 ఫైర్ అండ్ యాష్” బారి అంచనాల మధ్య తెరకెక్కిస్తున్నారు. తాజాగా జేమ్స్ కామెరాన్ ఇచ్చిన ఇంటర్వ్యూ లో అయన మాట్లాడుతూ.. ఇది ఆడియన్సు హుహాలకి అంధవిధంగా ఉండబోతుంది. గత రెండు సినిమాలతో పోలిస్తే సినిమా నిడివి కూడా ఎక్కువ ఉంటుంది అని తెలిపారు. గత రెండు సినిమాలో చుసిన విజువల్స్ కంటే ఈ సినిమాలో విజువల్స్ ఇంకో రేంజ్ లో ఉంటాయి.. ఇందులో ప్రయోగాలు చేసినట్టు చెప్పారు కొత్త సినీ వరల్డ్ ఇంకా బలమైన స్టోరీ తో పాటు పాత్రల మీద కూడా ఎక్కువ ద్రుష్టి పెడుతునాటు చెప్పుకొచ్చారు.
ఈ యేడాది చివరిలో డిసెంబర్ 19న ఈ మూడో భాగం రాబోతోంది. ముందు రెండు భాగాల్లో లేని అద్భుతాలను జేమ్స్ కామెరూన్ ఇందులో ఆవిష్కరించబోతున్నారట. అలానే దీనికి కొనసాగింపుగా `అవతార్ -4 2029లోనూ, ఈ సీరిస్ లో చివరిదైన అవతార్ -5 2031 డిసెంబర్ లోనూ విడుదల కానుంది. ఇక మీదట రానున్న అవతార్ సీరిస్ మూవీస్ అన్నీ ప్రేక్షకుల ఊహకు మించి ఉంటాయని జేమ్స్ కామెరూన్ హామీ ఇస్తున్నారు.