Mahaa breaking news

Earthquake: ఈ దేశాన్ని భూకంపం వణికించింది..

Earthquake: దక్షిణ తైవాన్‌ను భారీ భూకంపం కుదిపేసింది. మంగళవారం తెల్లవారుజామున 12:17 గంటల సమయంలో భూమి ఒక్కసారిగా కంపించింది. రిక్టర్ స్కేలుపై భూకంపం తీవ్రత 6.4గా నమోదైంది. భూకంపం చియూయ్ కౌంటీ హాల్‌కు ఆగ్నేయంగా 38 కిలోమీటర్ల దూరంలో, భూమికి 10 కిలోమీటర్ల లోతులో కేంద్రీకృతమై ఉందని తైవాన్ సెంట్రల్ వెదర్ అడ్మినిస్ట్రేషన్ వెల్లడించింది.

ఈ భూకంపం ప్రభావంతో చియూయ్, తైవాన్ నగరాల చుట్టుపక్కల స్వల్పస్థాయిలో నష్టం వాటిల్లినట్లు స్థానిక మీడియా తెలిపింది. ఈ ఘటనలో 27 మందికి స్వల్ప గాయాలు అయినట్లు పేర్కొంది. గాయపడిన వారిని ఆసుపత్రులకు తరలించినట్లు తైవాన్ అగ్నిమాపక విభాగం తెలిపింది. మరణాలకు సంబంధించిన ఎలాంటి సమాచారం ఇప్పటివరకు అందలేదని అధికారులు వెల్లడించారు.

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Vijayasai Reddy: రాజ్య‌స‌భ చైర్మ‌న్‌కు విజ‌య‌సాయి రాజీనామా లేఖ‌.. పార్టీలో ఉండాల‌ని కోరిన మ‌రో ఎంపీ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *