James Bond: హాలీవుడ్ స్పై థ్రిల్లర్ ఐకాన్ జేమ్స్ బాండ్ సినిమా సిరీస్ కొత్త రూపం సంతరించుకోనుంది. రాబోయే జేమ్స్ బాండ్ చిత్రానికి దర్శకుడిగా ప్రముఖ ఫిల్మ్‌మేకర్ డెనిస్ విలనోవ్ ఎంపికైనట్లు అమెజాన్ MGM స్టూడియోస్ ప్రకటించింది. ‘డూన్’, ‘బ్లేడ్ రన్నర్ 2049’, ‘సికారియో’ వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాలతో సినీ ప్రియులను మంత్రముగ్ధులను చేసిన విలనోవ్, ఈ సారి బాండ్ సినిమాకు తనదైన విజన్‌ను తీసుకొస్తున్నారు. ఈ చిత్రం 2026లో విడుదల కానుందని, ఎమీ పాస్కల్, డేవిడ్ హేమాన్ నిర్మాణంలో రూపొందనుందని తెలుస్తోంది. జేమ్స్ బాండ్ పాత్ర కోసం హీరో ఎంపిక ఇంకా ఖరారు కానప్పటికీ, విలనోవ్ దర్శకత్వంలో అభిమానులకు సరికొత్త యాక్షన్, స్టైల్, సస్పెన్స్ అనుభవం గ్యారంటీ అని హాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ సినిమా బాండ్ ఫ్రాంచైజీలో కొత్త మైలురాయిగా నిలుస్తుందని అంచనాలు ఉన్నాయి. సినీ లవర్స్ ఈ కొత్త అధ్యాయం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Amazon MGM Studios sets Denis Villeneuve as director of next James Bond film.
Tanya Lapointe will serve as executive producer. As previously announced, Amy Pascal and David Heyman will serve as producers. pic.twitter.com/7RJAweHhRh
— Amazon MGM Studios (@AmazonMGMStudio) June 26, 2025

