Jagannath Rath Yatra Stampede

Jagannath Rath Yatra Stampede: పూరీ జగన్నాథ రథయాత్రలో తొక్కిసలాట.. ముగ్గురు మృతి

Jagannath Rath Yatra Stampede: ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఒడిశా పూరీ జగన్నాథ రథయాత్ర ఈసారి విషాదంగా మారింది. జూన్ 27న ప్రారంభమైన ఈ పండుగలో జూన్ 29 ఆదివారం తెల్లవారుజామున ఘోర ఘటన జరిగింది. గుండిచా ఆలయం వద్ద ఒక్కసారిగా జరిగిన తొక్కిసలాటలో మూడు ప్రాణాలు కోల్పోయాయి. మరికొంతమంది తీవ్రంగా గాయపడ్డారు.

తొక్కిసలాట ఎలా జరిగింది?

అరుణోదయ సమయంలో, 4:20 నుంచి 4:30 మధ్య సమయంలో, గుండిచా ఆలయ వద్ద రథాలను లాగేందుకు భక్తులు పెద్ద ఎత్తున చేరుకున్నారు. అదే సమయంలో చెక్క దుంగలు మోసుకొస్తున్న రెండు ట్రక్కులు జనసంద్రములోకి ప్రవేశించడంతో అపశృతి చోటుచేసుకుంది. ఒకేసారి తొక్కిసలాట ఏర్పడి, 70 ఏళ్ల వృద్ధుడు ప్రేమకాంత్ మొహంతి, బసంతి సాహూ, ప్రభాతి దాస్ అనే మహిళలు మృతి చెందారు. వీరంతా ఒడిశా ఖుర్దా జిల్లాకు చెందినవారు.

ఇది కూడా చదవండి: Robbery Attempt: విశాఖ ఎక్స్‌ప్రెస్ రైలులో చోరీకి దుండ‌గుల య‌త్నం.. పోలీసుల కాల్పుల‌తో పరారీ

గాయపడినవారి పరిస్థితి

ఈ ఘటనలో 50 మందికిపైగా గాయపడ్డారు, వీరిలో 12 మందిని కటక్‌లోని ప్రత్యేక ఆసుపత్రికి తరలించారు. కొంతమంది పరిస్థితి విషమంగా ఉంది. గాయపడినవారికి వెంటనే చికిత్స అందిస్తున్నామని అధికారులు తెలిపారు.

ఉక్కపోతతో అస్వస్థతకు గురైన భక్తులు

రథయాత్ర మొదలైన తొలి రోజు నుంచే అధిక వేడి, ఉక్కపోత కారణంగా భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇప్పటివరకు 750 మందికి పైగా భక్తులు అస్వస్థతకు గురై ఆసుపత్రికి వెళ్లాల్సి వచ్చింది. ఎక్కువ మంది జలదాహం, అలసటతో బాధపడ్డారు. వీరిలో కొంతమందిని ప్రథమ చికిత్స అనంతరం డిశ్చార్జ్ చేశారు.

ప్రభుత్వ స్పందన

ఒడిశా మంత్రి పృథ్వీరాజ్ హరిచందన్ ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటనపై ఉన్నత స్థాయి విచారణకు ఆదేశాలు జారీ చేశారు. భక్తుల రక్షణ కోసం ముందస్తు చర్యలు తీసుకోకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Maharashtra: హమ్మయ్య.. మహారాష్ట్ర మంత్రివర్గం కొలువు తీరింది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *