Jagan Rentapalla Tour

Jagan Rentapalla Tour: జగన్ రెంటపాళ్ల పర్యటనలో రోడ్డు ప్రమాదం లో గాయపడ్డ వ్యక్తి మృతి

Jagan Rentapalla Tour: వైఎస్ జగన్ పర్యటనలో దురదృష్టకర ఘటన చోటుచేసుకుంది. గుంటూరు జిల్లా రెంటపాళ్ల వద్ద జరిగిన ఈ సంఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. జగన్ కాన్వాయ్ వెనుక ఉండే వాహనం ఓ వృద్ధుడిని ఢీకొట్టడంతో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. ఆసుపత్రికి తరలించినప్పటికీ, చికిత్స ఫలించక ఆయన మరణించారు.

ఏటుకూరు బైపాస్ వద్ద ప్రమాదం

జగన్ పర్యటన జరుగుతున్న సమయంలో, హైవేపైని ఏటుకూరు బైపాస్ వద్ద ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. నడుచుకుంటూ వెళ్తున్న వృద్ధుడిని కాన్వాయ్‌లోని వాహనం బలంగా ఢీకొట్టింది. ప్రమాద తీవ్రతను చూస్తే, వాహనం వేగంగా వచ్చి ఢీకొట్టినట్లు తెలుస్తోంది.

ఆస్పత్రికి తరలించిన 108 సిబ్బంది

తీవ్ర గాయాల పాలైన వృద్ధుడిని చావు బతుకుల మధ్య పోరాడుతున్న పరిస్థితిలో చూసిన స్థానికులు వెంటనే 108 అంబులెన్స్‌కు సమాచారం అందించారు. అతి తక్కువ సమయంలో అక్కడికి చేరుకున్న వైద్య సిబ్బంది బాధితుడిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. అయితే అక్కడ చికిత్స పొందుతూ ఆయన ప్రాణాలు కోల్పోయారు.

మానవత్వం మరిచిన నేతలు..?

ఈ ఘటనపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రమాదం జరిగిన తర్వాత జగన్ కాన్వాయ్ ఆగకుండా ముందుకు వెళ్లిపోయిందని, ఏ ఒక్క వైసీపీ నేత అయినా ఆ వృద్ధుడి పరిస్థితిని గమనించలేదని వారు ఆరోపిస్తున్నారు. “ప్రమాదం జరిగి మనిషి ప్రాణాలతో పోరాడుతుంటే కనీసం ఓపిక పట్టి ఆగి చూచినా మానవత్వం కనపడేది” అంటూ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

పోలీసుల విచారణ ప్రారంభం

ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. కాన్వాయ్‌లో ఉన్న వాహన వివరాలు, డ్రైవర్ ఎవరు, ప్రమాదం జరిగిన సమయంలో వాహనం వేగం ఎంత? అనే కోణాల్లో పోలీసులు విచారణ చేస్తున్నారు. బాధితుడి కుటుంబానికి ప్రభుత్వం సాయం చేయాలంటూ పెద్ద ఎత్తున డిమాండ్లు వ్యక్తమవుతున్నాయి.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *