దులీప్‌ ట్రోఫీ.. 47 ఏళ్లనాటి రికార్డు బద్దలు

దులీప్ ట్రోఫీ చరిత్రలో నాలుగు బంతుల్లో నాలుగు వికెట్లు తీసిన తొలి బౌలర్‌గా జమ్మూ కాశ్మీర్ పేస్ బౌలర్ ఔకిబ్ నబీ నిలిచాడు.ఈ ఘనత సాధించడం ద్వారా 47 ఏళ్ల క్రితం కపిల్ దేవ్ నెలకొల్పిన రికార్డును ఆయన బద్దలు కొట్టాడు.53వ ఓవర్ చివరి మూడు బంతుల్లో అతను విరాట్ సింగ్, మనీషి, ముఖ్తార్ హుస్సేన్‌లను క్లీన్ అవుట్ చేశాడు. తన తదుపరి ఓవర్ మొదటి బంతికే సూరజ్ సింధు జైస్వాల్‌ను అవుట్ చేసి నాలుగు బంతుల్లో నాలుగు వికెట్లు తీసిన మొదటి ఆటగాడిగా నిలిచాడని విజ్డెన్ తెలిపింది. నబీ అద్భుత ప్రదర్శనతో నార్త్ జోన్ జట్టుకు 175 పరుగుల విలువైన ఆధిక్యం లభించింది. 1978లో కపిల్ దేవ్ దులీప్ ట్రోఫీలో హ్యాట్రిక్ సాధించాడు. ఇప్పుడు అఖిబ్ నబీ నాలుగు వరుస బంతుల్లో నాలుగు వికెట్లు తీసి రికార్డులను తిరగరాశాడు. ఈ ఘనతను సాధించిన తర్వాత అఖిబ్ నబీ, ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో నాలుగు బంతుల్లో నాలుగు వికెట్లు తీసిన నాల్గవ భారత బౌలర్‌గా నిలిచాడు. ఇంతకు ముందు ఎస్.సాయిన్, ఎం.ముదసిర్, కుల్వంత్ ఖేజ్రోలియా ఈ ఘనత సాధించారు.

దులీప్ ట్రోఫీ చరిత్రలో హ్యాట్రిక్‌లు

కపిల్ దేవ్ – నార్త్ జోన్ vs వెస్ట్ జోన్, 1978

సాయిరాజ్ బహుతులే – వెస్ట్ జోన్ vs ఈస్ట్ జోన్, 2001

ఔకిబ్ నబీ – నార్త్ జోన్ vs ఈస్ట్ జోన్, 2025

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Delhi: ఢిల్లీలో మార్నింగ్ వాక్ చేస్తున్న బిజినెస్ మ్యాన్‌పై కాల్పులు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *