హైదరాబాద్‌లో ఐటీ రైడ్స్ కలకలం రేగింది.రియల్ఎస్టేట్ వ్యాపారుల ఇండ్లలో తనిఖీలు చేస్తున్నారు ఐటీ అధికారులు.హైదరాబాద్‌తోపాటు రంగారెడ్డి, మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో ఏకకాలంలో 30 చోట్ల దాడులు చేశారు.అన్విత బిల్డర్స్ అధినేత బొప్పన అచ్యుతరావుతోపాటు ఆయన కుటుంబ సభ్యులైన బొప్పన శ్రీనివాసరావు, బొప్పన అనూస్ ఇండ్లు, కార్యాలయాల్లో తనిఖీలు చేస్తున్నారు.
మరో సైడ్..గూగి ప్రాపర్టీస్ అండ్ డెవలపర్స్ కార్యాలయం లోనూ ఐటీ దాడులు కొనసాగుతున్నాయి.15 గూగి ప్రాపర్టీస్ ఆఫీసుల్లో సోదాలు నిర్వహిస్తున్నారు.పటిష్టమైన భద్రత నడుమ సోదాలు నిర్వహిస్తున్నారు.ఫైళ్లను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు అధికారులు.