Drinker Sai: కొత్తవాళ్ళకు తెలుగు సినిమా రంగంలో చోటు దక్కదని, వారిని ప్రోత్సహించరని జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని తమ ‘డ్రింకర్ సాయి’ చిత్రం నిరూపించిందన్నారు హీరో ధర్మ. అతను హీరోగా, ఐశ్వర్య శర్మ హీరోయిన్ గా నటించిన ‘డ్రింకర్ సాయి’ మూవీ డిసెంబర్ 27న విడుదలైంది. రెండోవారంలోనూ చక్కని కలెక్షన్స్ తో సినిమా ప్రదర్శితమౌతోందని, ఇంతవరకూ 5.75 కోట్ల గ్రాస్ వసూలు అయ్యిందని నిర్మాతలు బసవరాజు శ్రీనివాస్, ఇస్మాయిల్ షేక్, లహరిధర్ తెలిపారు. తాను అనుకున్న పాయింట్ కు ప్రేక్షకులు కనెక్ట్ కావడం ఆనందాన్ని కలిగించిందని, ఈ సినిమాతో 20 మందిని పరిచయం చేశామని దర్శకుడు కిరణ్ తిరుమలశెట్టి చెప్పారు. మంగళవారం మీడియా కోసం ఈ చిత్రాన్ని ప్రసాద్ ప్రివ్యూ థియేటర్ లో ప్రత్యేకంగా ప్రదర్శించారు. ఈ సందర్భంగా జరిగిన మీడియా సమావేశంలో చిత్ర బృందం మాట్లాడుతూ తమ చిత్రాన్ని ఆదరించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపారు.

