ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతున్నాయి. గాజాపై ఇజ్రాయెల్ సైన్యం విరుచుకుపడుతోంది.గాజాలోని జబాలియా శిబిరంపై ఇజ్రాయెల్ ఎయిర్ ఫోర్స్ దాడి చేశారు. ఈ దాడుల్లో 33 మంది మరణించారు. మృతుల్లో 21 మంది మహిళలు ఉన్నారు. ఈ దాడిలో 85 మందికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుల సంఖ్యమరింత పెరిగే అవకాశం ఉంది.
ఇజ్రాయెల్ దాడుల్లో ఇప్పటివరకు మొత్తం 42వేల 500మంది మృతిచెందినట్లు గాజా ఆరోగ్య శాఖ ప్రకటించింది. మరోవైపు సిరియా డ్రోన్ల ద్వారా ఇజ్రాయెల్ పై దాడికి ప్రయత్నించిన దళాలు భూభాగంలోకి ప్రవేశించకముందే కూల్చివేశామని తెలిపారు.