isha gramotsavam

isha gramotsavam: ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో ఈశా గ్రామోత్సవం

ఆంధ్ర ప్రదేశ్ లో ఈశా గ్రామోత్సవం రాష్ట్ర (డివిజినల్) స్థాయి పోటీలు ఈరోజు అంటే డిసెంబర్ 8న ఆచార్య నాగార్జున యూనివర్సిటీ లో జరిగాయి .

2004 నుండి ఈశా ఫౌండేషన్  నిర్వహిస్తున్న గ్రామీణ క్రీడోత్సవమే ఈశా గ్రామోత్సవం. క్రీడలను గ్రామీణుల జీవితంలో ఒక భాగంగా మార్చి తద్వారా వారి ఆరోగ్యాన్ని, శ్రేయస్సుని పెంపొందించడమే దీని ముఖ్య ఉద్దేశంగా ఈశా ఫౌండేషన్ నిర్వాహకులు చెబుతున్నారు .  ఈ  పోటీలు ప్రొఫెషనల్ ఆటగాళ్ల కోసం కాదు. సాధారణ గ్రామీణులకు ఆటలో భాగమై, ఆడడంలో ఉన్న సంతోషాన్ని రుచి చూపించడమే దీని ప్రత్యేకతగా ఉంది .

ఈ సంవత్సరం దక్షిణ భారతదేశంలోని అయిదు రాష్ట్రాల్లో దీనిని నిర్వహిస్తున్నారు. ఈ పోటీలను 3 స్థాయిల్లో నిర్వహిస్తున్నారు. జిల్లా, డివిజినల్ ఇంకా ఫైనల్స్. ఫైనల్స్ కోయంబత్తూరులోని ఈశా యోగా సెంటర్ లో నిర్వహిస్తారు. ఆంధ్రప్రదేశ్ లోని 13 జిల్లాల నుండి జిల్లా స్థాయి పోటీలకు 253 వాలీబాల్ & 97 త్రోబాల్ టీంలతో అద్భుతమైన స్పందన లభించింది. సుమారు 3500కు పైగా ఆటగాళ్ళు గ్రామోత్సవంలో పాల్గొన్నారు.

ఆంధ్రప్రదేశ్ లో 13 జిల్లాల విన్నర్ లు ఇంకా రన్నర్ లు పాల్గొనే ఈ ఉత్సాహభరిత పోటీలను ఈషా పుండేషన్ లో ఏర్పాటు చేశారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Health Tips: ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉండాలంటే.. ఈ జ్యూస్ తాగాల్సిందే!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *