Trisha

Trisha: పెళ్ళికి రెడీ అయిన త్రిష?

Trisha: సీనియర్ నటి త్రిష, నలభై పదుల వయస్సులోనూ స్టార్ హీరోయిన్‌గా కొనసాగుతోంది. తన గ్లామర్, గ్రేస్‌తో యంగ్ హీరోయిన్స్‌కు పోటీగా నిలుస్తోంది. అయితే తాజాగా ఆమె ఇన్‌స్టాగ్రామ్‌ పోస్ట్ ఆమె పెళ్లి వార్తలపై హిట్ ఇస్తుంది. ఈ పోస్ట్ లో త్రిష చీర, గజ్రా, జ్యూవెలరీతో ట్రెడిషనల్ లుక్‌లో మెరిసిపోతూ ఉంది. ఈ పోస్ట్ తో సోషల్ మీడియాలో త్రిష పెళ్లిపై గాసిప్స్ మొదలయ్యాయి.

ఇది ఆమె స్పెషల్ పర్సన్‌ను సూచిస్తుందా లేక సినిమా ప్రమోషనా అని అభిమానులు ఊహాగానాలు చేస్తున్నారు. గతంలోనూ త్రిష వివాహం గురించి వార్తలు వచ్చినా అవి గాసిప్స్‌గానే మిగిలాయి. అయితే ఈ తాజా పోస్ట్ మాత్రం ఆ గాసిప్స్ ని నిజం చేసేలా ఉంది. పైగా ఈ పోస్ట్ కి లక్షల్లో లైక్స్ వస్తున్నాయి. అంతేగాక దీనికి “Love always wins” క్యాప్షన్ పెట్టి గ్రీన్ హార్ట్ సింబల్ ని త్రిష యాడ్ చేసింది.

Also Read: Mahesh-Boyapati: బోయపాటితో మహేష్ ఊర మాస్ సినిమా?

Trisha: అయితే ఈ పోస్ట్ వెనక అసలు అర్థం ఏమిటన్నది తెలియాలంటే మాత్రం వెయిట్ చెయ్యాల్సిందే. ప్రస్తుతం తమిళ్, తెలుగు సినిమాలతో బిజీగా ఉన్న త్రిష, సస్పెన్స్ థ్రిల్లర్‌లోనూ నటిస్తోంది. లియో సినిమాతో బౌన్స్ బ్యాక్ అయిన త్రిష, విశ్వంభరలో చిరంజీవితో, గుడ్ బ్యాడ్ అగ్లీలో అజిత్‌తో నటిస్తూ కెరీర్‌లో హైలో ఉంది. రాబోయే ఈ చిత్రాలతో ఆమె ఎలాంటి విజయాలు సాధిస్తుందో చూడాలి.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *