War-2: బాలీవుడ్‌లో సంచలనం సృష్టించేందుకు సిద్ధమవుతున్న స్పై థ్రిల్లర్ ‘వార్-2’ సినిమా ప్రేక్షకుల్లో భారీ అంచనాలను రేకెత్తిస్తోంది. దర్శకుడు అయాన్ ముఖర్జీ రూపొందిస్తున్న ఈ చిత్రంలో హృతిక్ రోషన్, ఎన్టీఆర్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. యశ్ రాజ్ ఫిల్మ్స్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ మూవీలో కియారా అద్వానీ హీరోయిన్‌గా కనిపించనుంది.
బాక్సాఫీస్ వద్ద కొత్త రికార్డులు సృష్టించాలన్న లక్ష్యంతో మేకర్స్ శ్రమిస్తున్నారు. ఇటీవల విడుదలైన టీజర్ అభిమానుల్లో ఉత్సాహాన్ని పెంచినప్పటికీ, ఎన్టీఆర్ పాత్రకు సంబంధించి కొంత నెగటివ్ స్పందన రావడం గమనార్హం. దీంతో అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మేకర్స్ టీజర్‌లోని లోపాలను సమీక్షించే పనిలో పడ్డారు.
Also Read: Harihara Veeramallu: హరిహర వీరమల్లు వివాదం.. పవన్ సినిమాపై కుట్ర?
War-2: సాంకేతికంగా లేదా కంటెంట్‌లో ఏమైనా లోటుపాట్లు ఉన్నాయా అని పరిశీలిస్తున్నారు. త్వరలోనే సరిదిద్దిన కంటెంట్‌తో మరోసారి ప్రేక్షకుల ముందుకు రావాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రం అంచనాలను అందుకుంటూ బాక్సాఫీస్‌ను షేక్ చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు.
వార్ 2 అధికారిక టీజర్ :