TS TET: టెట్ (ఉపాధ్యాయ అర్హత పరీక్ష )కు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. జనవరి 2 నుంచి 20 వరకు 10 రోజులపాటు 20 సెషన్లలో పరీక్షలు జరగనున్నాయి. ఈ పరీక్షలకు రాష్ట్రవ్యాప్తంగా 2,75,773 మంది అభ్యర్థులు హాజరుకానున్నారు. ఈ టెట్ రాత పరీక్షలను కంప్యూటర్ బేస్డ్ విధానంలో ప్రభుత్వం నిర్వహించనున్నది.
TS TET: ప్రతి రోజూ రెండు సెషన్లలో ఈ టెట్ పరీక్షలు జరగనున్నాయి. ఉదయం 9 గంటల నుంచి 11.30 గంటల వరకు మొదటి సెషన్, మధ్యాహ్నం 2 గంటల నుంచి 4.30 గంటల వరకు రెండో సెషన్ నిర్వహించనున్నారు. పేపర్ 1 పరీక్షలకు జనవరి 8, 9, 10, 18 తేదీల్లో నిర్వహించనున్నారు. పేపర్ 2 పరీక్షలను జనవరి 2, 5, 11, 12, 19, 20 తేదీల్లో జరుగుతాయి.
TS TET: పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులకు టెట్ నిర్వహణాధికారులు పలు సూచనలు చేశారు. మెహందీతో వస్తే పరీక్ష కేంద్రంలోకి అనుమతించేది లేదని అధికారులు స్పష్టం చేశారు. స్మార్ట్ వాచీలతోపాటు ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలకు అనుమతి లేదని తెలిపారు. హాల్ టికెట్లపై సూచించిన నిబంధనలను అభ్యర్థులు తప్పకుండా పాటించాలని పేర్కొన్నారు.
TS TET: పరీక్ష కేంద్రాలకు అభ్యర్థులు రెండు గంటల ముందే చేరుకోవాలని అధికారులు తెలిపారు. ఉదయం సెషన్‌కు హాజరయ్యే అభ్యర్థులను ఉదయం 7.30 నుంచి పరీక్ష కేంద్రంలోకి అనుమతించనున్నారు. మధ్యాహ్నం సెషన్‌కు 12.30 గంటల నుంచి కేంద్రంలోనికి అనుమతిస్తారు. పరీక్ష ప్రారంభానికి 15 నిమిషాల ముందే పరీక్షా కేంద్రం గేట్లను మూసివేయనున్నారు. అంటే ఉదయం 8.45 గంటలకు, మధ్యాహ్నం 1.45 గంటలకే గేట్లను మూసి వేస్తారు.
TS TET: అభ్యర్థులు హాల్ టికెట్లతోపాటు బ్లాక్ లేదా బ్లూబాల్ పాయింట్ పెన్ను, గుర్తింపు కార్డు (ఆధార్, డ్రైవింగ్ లైసెన్స్, పాస్‌పోర్ట్, పాన్‌కార్డు, ఓటర్ ఐడీలలో ఏదైనా ఒకటి)లను తమ వెంట తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఇదిలా ఉండగా, కొందరు అభ్యర్థులకు దూర ప్రాంతాల్లో పరీక్ష కేంద్రాలు పడటంతో ఆందోళన చెందుతున్నారు. వారి సొంత జిల్లాలకు సుమారు 100 నుంచి 300 కిలోమీటర్ల దూరంలో ఆయా కేంద్రాలు ఉండటంతో సకాలంలో వెళ్లలేమని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంతదూరం వెళ్లి పరీక్షలు ఎలా రాయాలంటూ వారు ప్రశ్నిస్తున్నారు.