Railway: శబరిమల అయ్యప్ప క్షేత్రాన్ని దర్శించుకోవాలనుకునే భక్తులు, యాత్రికులకు ఐఆర్సీటీసీ (ఇండియన్ రైల్యే క్యాటరింగ్, టూరిజం కార్పొరేషన్) శుభవార్త చెప్పింది. తెలంగాణలోని సికింద్రబాద్ నుంచి శబరిమలకు ప్రత్యేక భారత్ గౌరవ్ టూరిస్టు రైలును వచ్చే నెలలో నడపాలని నిర్ణయించింది. నవంబర్ 16వ తేదీ నుంచి 20 తేదీ వరకు నడుపనున్నట్ట ప్రకటించింది.
Railway: ఒక్కో టికెట్ ధర రూ.11,475 నుంచి ప్రారంభమవుతాయని తెలిపింది. భోజనాలు రైల్యే సిబ్బందే చూసుకుంటారు. అలాగే యాత్రికులకు ట్రావెల్ ఇన్సూరెన్స్ కూడా ఉంటుంది. అయ్యప్ప భక్తులు, శబరిమల యాత్రికులు ఈ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఐఆర్సీటీసీ కోరింది.