Brian Lara: వెస్టిండీస్ క్రికెట్ పతనంపై బ్రియన్ లారా తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఐపీఎల్, ఇతర టీ20 లీగ్‌లు వెస్టిండీస్ క్రికెట్‌ను నాశనం చేస్తున్నాయని ఆయన పరోక్షంగా అభిప్రాయపడ్డారు. వెస్టిండీస్ ఆటగాళ్లు ఇప్పుడు జాతీయ జట్టు తరపున ఆడటం కంటే ఐపీఎల్, ఇతర ఫ్రాంచైజీ లీగ్‌లలో ఆడటానికి ఎక్కువ ఆసక్తి చూపుతున్నారని.. ఈ లీగ్‌లలో లభించే భారీ ఆదాయం దీనికి ప్రధాన కారణం అన్నాడు. నికోలస్ పూరన్ వంటి స్టార్ ఆటగాళ్లు అంతర్జాతీయ క్రికెట్ నుండి నిష్క్రమించి టీ20 లీగ్‌లలో ఆడటానికి మొగ్గు చూపడం దీనికి నిదర్శనం అని తెలిపాడు. ఆటగాళ్లు దేశం పట్ల విధేయతతో ఉండేలా, జాతీయ జట్టుకు ఆడేలా క్రికెట్ వెస్టిండీస్ (CWI) గణనీయమైన చర్యలు తీసుకోవడం లేదని లారా విమర్శించారు.
ఇది కూడా చదవండి: BC Reservation Ordinance: బీసీ రిజర్వేషన్ ఆర్డినెన్స్‌పై గవర్నర్ డైలమా!
రత్, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ వంటి దేశాల క్రికెట్ బోర్డులు తమ ఆటగాళ్లను జాతీయ జట్టుకే తొలి ప్రాధాన్యత ఇచ్చేలా ఆంక్షలు విధిస్తున్నాయని, కానీ వెస్టిండీస్ క్రికెట్ బోర్డు అలా చేయడం లేదని లారా అన్నారు. వెస్టిండీస్ క్రికెట్ బోర్డు అంతగా ఆదాయం లేకపోవడం వల్ల ఆటగాళ్లకు భారీ మొత్తాలు చెల్లించలేకపోతోందని, ఇతర ఫ్రాంచైజీ లీగ్స్ ఆడకుండా అడ్డుకోలేకపోతోందని ఆయన పేర్కొన్నారు. ఆర్థికంగా బలమైన లీగ్‌లు అందుబాటులో ఉన్నందున, వెస్టిండీస్ ఆటగాళ్లు సహజంగానే ప్రత్యామ్నాయాల కోసం చూస్తున్నారని లారా అభిప్రాయపడ్డారు. ఇది ఆటగాళ్ల తప్పు కాదని, బోర్డు విధానాలే దీనికి కారణమని ఆయన పరోక్షంగా సూచించారు. ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన టెస్ట్ సిరీస్‌లో వెస్టిండీస్ 0-3తో క్లీన్ స్వీప్ అవ్వడం, ఒక ఇన్నింగ్స్‌లో కేవలం 27 పరుగులకే ఆలౌట్ కావడం వంటి దారుణ ప్రదర్శనల నేపథ్యంలో లారా ఈ వ్యాఖ్యలు చేశారు.