IPL Schedule 2025: క్రికెట్ అభిమానులను ఉర్రూతలూగించే టోర్నమెంట్లు ఒకటి తర్వాత ఒకటి వస్తున్నాయి. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత ఇండియన్ ప్రీమియర్ లీగ్ జరుగుతుంది. దీనితో ఈ ఫిబ్రవరి నుండి మే వరకు అభిమానులకు అనివార్యంగా క్రికెట్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. ఈ నెల 19న ప్రారంభమయ్యే ఛాంపియన్స్ ట్రోఫీ మార్చి 9న ముగుస్తుంది. ఆ తర్వాత మార్చి 21న ఐపీఎల్ 2025 సీజన్ ప్రారంభమవుతుందని బీసీసీఐ ప్రకటించింది. అయితే దీనికి సంబంధించిన షెడ్యూల్ వివరాలు, ఓపెనింగ్ మ్యాచ్ జరిగే వేదిక మరియు బీసీసీఐ విధించిన కొత్త నియమాలు ఏమిటో చూద్దాం…!
ఇప్పటివరకు ఐపీఎల్ 18వ సీజన్ పూర్తి షెడ్యూల్ విడుదల కాలేదు. టోర్నమెంట్ మరో 38 రోజుల్లో ప్రారంభం కానుంది. బీసీసీఐ త్వరలోనే పూర్తి షెడ్యూల్ విడుదల చేస్తుందని కొన్ని నివేదికలు చెబుతున్నాయి. రిపోర్ట్స్ ప్రకారం, ఒక వారం రోజుల్లో బీసీసీఐ ఐపీఎల్ 2025 పూర్తి షెడ్యూల్ ప్రకటిస్తుంది.
ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభమయ్యే ముందే ఈడెన్ గార్డెన్స్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ తో ఎవరు ఆడతారో తెలిసిపోతుంది. డిఫెండింగ్ ఛాంపియన్‌తో టోర్నమెంట్ ప్రారంభం కావడం ఐపీఎల్ సంప్రదాయం. కాబట్టి మార్చి 21న కేకేఆర్ తో మొదటి మ్యాచ్ ఎవరు ఆడతారో వేచి చూడాలి.
ఇది కూడా చదవండి: Champions Trophy 2025: ఛాంపియన్స్ ట్రోఫీ నుండి బుమ్రా ఔట్…! హర్షిత్ రాణా, వరుణ్ లకు పిలుపు
ఈసారి ఐపీఎల్ 18వ ఎడిషన్ ఫైనల్ ఈడెన్ గార్డెన్స్‌లో జరుగుతుందని భావిస్తున్నారు. ప్లేఆఫ్ 2 కూడా కోల్‌కతాలో జరిగే అవకాశాలు ఉన్నాయి. ప్లేఆఫ్ 1, ఎలిమినేటర్ మ్యాచ్‌లు సన్‌రైజర్స్ హైదరాబాద్ హోమ్ గ్రౌండ్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరుగుతాయి.
పిచ్ నాణ్యతను కాపాడుకోవడానికి, ఐపీఎల్ వేదికలు లోకల్ మ్యాచ్‌లు, ప్రాక్టీస్ సెషన్లు లేదా సీజన్ ముందు అనధికారిక ఈవెంట్ల కోసం ఉపయోగించకూడదని స్టేట్ అసోసియేషన్లకు బీసీసీఐ స్పష్టం చేసింది. అలాగే, 2025 IPLలో ఐసీసీ ప్లేయర్స్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమలు చేస్తున్నారు. క్రికెటర్లు చేసే తప్పులకు ఐసీసీ నిబంధనల ప్రకారం చర్యలు ఉంటాయి. ఈ నిబంధనలతో, స్లో ఓవర్ రేట్ల వల్ల కెప్టెన్లు, జట్లపై భారీ జరిమానాలు ఉండవచ్చు.
గత సీజన్ల మాదిరిగా, IPL 2025లో మిడ్-సీజన్ ట్రాన్స్ఫర్ విండో ఉండదు. దీనివల్ల జట్లు తమ స్క్వాడ్లను మొదటి నుండి సరిగ్గా ప్లాన్ చేసుకోవాలి. మార్చి 21కి ముందే ఫ్రాంచైజీలు తమ స్క్వాడ్లతో ప్రీ-సీజన్ శిక్షణ ప్రారంభిస్తాయి. గతంలో ఐపీఎల్ మ్యాచ్‌లు జరిగిన గౌహతి, ధర్మశాలకు మళ్లీ అవకాశం ఇస్తున్నారు. గత సీజన్లో వివాదాస్పదమైన ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ 2025 IPLలో కూడా అమలులో ఉంది.