Kanpur

Kanpur: డాక్టర్ ఐఫోన్ కొట్టేశాడు.. గంటలో దొరికిపోయాడు!

Kanpur: కాన్పూర్‌లోని హాలెట్ ఆసుపత్రిలో ఒక డాక్టర్ ఐఫోన్ దొంగిలించబడింది. అయితే, ఆ దొంగ కేవలం 60 నిమిషాల్లోనే పట్టుబడ్డాడు. ఈ ఘటన ఆగస్టు 20న జరగగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మహ్మద్ ఫైజ్ అనే వ్యక్తి వికలాంగుడిలా నటిస్తూ చికిత్స కోసం ఆసుపత్రికి వచ్చాడు. వైద్య సిబ్బంది నమ్మంచి తరువాత అతను ఒక జూనియర్ డాక్టర్ కోటు జేబులో నుంచి ఐఫోన్‌ను చాకచక్యంగా దొంగిలించాడు.

ఈ దొంగతనం మొత్తం ఆసుపత్రిలోని సీసీటీవీ కెమెరాల్లో రికార్డ్ అయింది. ఫుటేజ్‌లో ఆ వ్యక్తి ఒక కర్రతో కుంటుతూ నడుస్తూ, డాక్టర్ల పక్కనుంచి వెళ్తూ ఐఫోన్ దొంగిలించడం స్పష్టంగా కనిపించింది. దొంగతనం గురించి తెలుసుకున్న వెంటనే పోలీసులు సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించి, నిందితుడిని గుర్తించారు. ఆ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు కేవలం 60 నిమిషాల్లోనే దొంగను పట్టుకున్నారు.

పోలీసుల వేగవంతమైన చర్యను డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ శ్రవణ్ కుమార్ అభినందించారు. విచారణలో, నిందితుడు తాను ఇలాంటి దొంగతనాలు గతంలో కూడా చేశానని అంగీకరించాడు. ఈ కేసును సీసీటీవీ ఫుటేజ్ సహాయంతో పోలీసులు పరిష్కరించగలిగారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Horoscope Today: మీ ప్రయత్నాలకు కుటుంబమంతా తోడుంటుంది.. దూసుకుపొండి!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *