Bigg Boss 9

Bigg Boss 9: రీతూ.. కళ్యాణ్ మధ్య రొమాన్స్.. హౌజ్‌లో ర‌చ్చ‌ చేసిన హరీష్

Bigg Boss 9: బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో 15వ రోజు ఎపిసోడ్ లో రొమాంటిక్, ఎమోషనల్ సన్నివేశాలు, గొడవలు జరిగాయి. ఎపిసోడ్ ప్రారంభంలోనే ఫ్లోరా షైనీ జైల్లో కనిపించగా, రీతూ చౌదరి ఎవరూ తనతో మాట్లాడడం లేదని బాధతో కన్నీళ్లు పెట్టుకుంది. ఈ సమయంలో కళ్యాణ్ ఆమెను ఓదార్చగా, వారి మధ్య చిన్నపాటి రొమాంటిక్ సీన్  క్రియేట్ అయింది. కొంత సేపు ఆ మోడ్ లోనే ఉండిపోయారు. 

ఇదిలా ఉండగా, బిగ్ బాస్ ఆదేశాల ప్రకారం టెనెంట్స్ నామినేషన్స్ చేపట్టారు. మొదట ఐదుగురి పేర్లు ఏకాభిప్రాయంతో నిర్ణయించగా, ఆ జాబితాలో సంజన, రీతూ చౌదరి, సుమన్ శెట్టి, ఫ్లోరా షైనీ, హరీష్ ఉన్నారు. అయితే హరీష్ తన పేరు చేర్చడంపై తీవ్రంగా ఆగ్రహించి, పవన్‌తో ఘర్షణకు దిగాడు. “నువ్వు రీతూ విషయమై పాక్షికంగా వ్యవహరిస్తున్నావు” అంటూ పవన్‌ను నిలదీశాడు.

ఇది కూడా చదవండి: Revanth Reddy: నేడు మేడారంలో సీఎం పర్యటన.. ఆలయ అభివృద్ధి పనులకు శంకుస్థాపన

తర్వాత ఓనర్స్‌కు స్వాప్ చేసే అవకాశం ఇవ్వడంతో, వారు సంజన, సుమన్ శెట్టి స్థానంలో కళ్యాణ్, ప్రియా పేర్లను చేర్చారు. దీనిపై ఇమ్మాన్యుయేల్ స్పష్టత ఇస్తూ, కళ్యాణ్ గేమ్‌లో యాక్టివ్‌గా లేడని, ప్రియా మాట్లాడే తీరు అందరికీ నచ్చడం లేదని చెప్పారు. ఈ నిర్ణయం ప్రియాను తీవ్రంగా కుంగదీసింది.

అంతేకాక, తర్వాతి రౌండ్‌లో శ్రీజ, రాము కూడా నామినేట్ అయ్యారు. అయితే కెప్టెన్ పవన్ తన సేవ్ చేసే పవర్ వినియోగించి శ్రీజను రక్షించాడు.

ఈ వారం నామినేట్ అయిన కంటెస్టెంట్స్:

  • కళ్యాణ్
  • ప్రియా
  • ఫ్లోరా షైనీ
  • రీతూ చౌదరి
  • హరీష్
  • రాము

మొత్తం గా, 15వ రోజు ఎపిసోడ్‌లో నామినేషన్ టెన్షన్, వాగ్వాదాలు, భావోద్వేగాలు, రొమాన్స్—all in one ప్యాకేజీగా ప్రేక్షకులను బాగా ఎంటర్‌టైన్ చేసింది.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *