International Women's Day:

International Women’s Day: మ‌హిళా లోకానికి తెలుగు ప్ర‌ముఖుల శుభాకాంక్ష‌లు.. ఎవ‌రేమ‌న్నారంటే?

International Women’s Day:మార్చి 8న ప్ర‌పంచ‌వ్యాప్తంగా అంత‌ర్జాతీయ మ‌హిళా దినోత్స‌వంగా జ‌రుపుకుంటారు. మ‌హిళ‌ల సాధికారత‌, లింగ స‌మానత్వం సాధ‌న కోసం మ‌హిళ‌లు ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఏటా ఇదే రోజున వేడుక‌లు జ‌రుపుకుంటుంటారు. ఇది 20వ శ‌తాబ్దం ఆరంభంలోనే ప్రారంభ‌మైంది. ఈ వేడుక‌లు ఉత్త‌ర అమెరికా, యూర‌ఫ్‌లోని కార్మిక ఉద్య‌మాల నుంచి ఉద్భ‌వించాయి.

International Women’s Day:తొలి మ‌హిళా దినోత్స‌వాన్ని 1909 ఫిబ్ర‌వ‌రి 28న‌ యునైటెడ్ స్టేట్స్‌లో జ‌రుపుకున్నారు. 1908లో న్యూయార్క్‌లో జ‌రిగిన వ‌స్త్ర కార్మికుల స‌మ్మె జ్ఞాప‌కార్థం సోష‌లిస్ట్ పార్టీ ఆఫ్ అమెరికా ఈ కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించింది. అప్ప‌టి నుంచి ప్ర‌పంచ‌వ్యాప్తంగా ప్ర‌తి ఏటా జ‌రుపుకోవడం ఆన‌వాయితీగా వ‌స్తున్న‌ది. ఈ సంద‌ర్భంగా ప‌లువురు ప్ర‌ముఖులు త‌మ అభిప్రాయాల‌ను వ్య‌క్తం చేశారు.

టీడీపీతో మ‌హిళాభ్యుద‌యం: ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడు
International Women’s Day:తెలుగింటి ఆడ‌ప‌డుచుల‌కు, మాతృ స‌మానులైన మ‌హిళా మ‌ణుల‌కు మ‌హిళా దినోత్స‌వం సంద‌ర్భంగా శుభాకాంక్ష‌లు. మ‌హిళ‌ల‌కు ఆస్తిలో వాటా, విద్య‌, ఉద్యోగాల్లో, రాజ‌కీయాల్లో రిజ‌ర్వేష‌న్లు క‌ల్పించ‌డం వంటి మ‌హిళాభ్యుద‌య కార్య‌క్ర‌మాలు టీడీపీ పాల‌న‌లో ఎన్నో చేప‌ట్టాం. ప్ర‌భుత్వ ప‌థ‌కాల‌ను మ‌హిళ‌ల పేరిటే చేపడుతున్నాం.

ప్ర‌భుత్వ ప‌థ‌కాలు మ‌హిళ‌ల‌కే ప్రాధాన్యం: సీఎం రేవంత్‌రెడ్డి
International Women’s Day:మ‌హిళా లోకానికి అంత‌ర్జాతీయ మ‌హిళా దినోత్స‌వ శుభాకాంక్ష‌లు. సాధికార‌త‌, లింగ స‌మాన‌త్వం సాధించే దిశ‌గా ప‌థ‌కాలు చేప‌డుతాం. ప్ర‌భుత్వ ప‌థ‌కాల‌న్నింటిలో మ‌హిళ‌ల‌కే ప్రాధాన్యం ఇస్తాం. కోటి మంది మ‌హిళ‌ల‌ను కోటీశ్వ‌రుల‌ను చేయ‌డ‌మే మా ప్ర‌భుత్వ ల‌క్ష్యం. అలుపెర‌గ‌కుండా ప‌నిచేస్తున్న నారీశ‌క్తికి వంద‌నాలు

మ‌హిళా సాధికార‌త‌కు బీఆర్ఎస్ పెద్ద‌పీట‌: కేసీఆర్‌
International Women’s Day:తెలంగాణ మ‌హిళాలోకానికి ప్ర‌పంచ మ‌హిళా దినోత్స‌వ శుభాకాంక్ష‌లు. మ‌హిళా సాధికార‌త‌కు బీఆర్ఎస్ ప్ర‌భుత్వ హ‌యాంలో పెద్దపీట వేశాం. మ‌హిళ‌లే కేంద్రంగా అనేక ప‌థ‌కాల‌ను అమ‌లు చేశాం. మ‌హిళల భాగ‌స్వామ్యంతోనే తెలంగాణ ప్ర‌గ‌తి సాధించింది. అదే స్ఫూర్తి ఇప్పుడు కూడా కొన‌సాగించాలి.

మ‌హిళ‌లు ధ్ర‌డంగా ఉండాలి: మంత్రి సీత‌క్క‌
International Women’s Day:మ‌హిళ‌ల‌కు ఈ మ‌హిళా దినోత్స‌వం సంద‌ర్భంగా శుభాకాంక్ష‌లు. మ‌హిళ‌లు మాన‌సికంగా, శారీర‌కంగా ధ్రుడంగా ఉండాలి. మ‌హిళ‌లంటే ఒక‌ప్పుడు చిన్న‌చూపు ఉండేది. స‌మాన ప‌నికి స‌మాన వేత‌నం అనే డిమాండ్‌తో ఏక‌మైన మ‌హిళ‌ల‌తో ఈ మ‌హిళా దినోత్స‌వం ప్రారంభ‌మైంది. మ‌హిళ‌ల‌ను ఎద‌గ‌నిద్దాం, గౌర‌విద్దాం, ఆత్మ‌గౌర‌వంతో త‌లెత్తుకొని తిర‌గ‌నిద్దాం.

పోలీస్ శాఖ‌లో పెరిగిన మ‌హిళా ప్రాధాన్యం: హైద‌రాబాద్ సీపీ సీవీ ఆనంద్‌
International Women’s Day:పోలీస్ శాఖ‌లో మ‌హిళా ప్రాధాన్యం పెరిగింది. క‌మిష‌న‌రేట్ ప‌రిధిలో 20 మంది డీసీపీల్లో 8 మంది మ‌హిళా డీసీపీలు ఉన్నారు. లా అండ్ ఆర్డ‌ర్‌, ట్రాఫిక్ పోలీస్ స్టేష‌న్ల‌లో ఇటీవ‌ల మ‌హిళా షోల‌ను నియ‌మించాం. క‌మిష‌న‌రేట్‌లో 18 వేల మంది పోలీస్ సిబ్బందిలో 30 శాతం మంది మ‌హిళ‌లే ఉన్నారు. ఇవ‌న్నీ మ‌హిళా ప్రోగ్రెస్‌కు నిద‌ర్శ‌నం.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *