Indiramma Indlu:తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు మరో శుభవార్త అందింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులకు ఉపాధి హామీ పథకాన్ని అనుసంధానం చేసింది. ప్రతి ఇంటి నిర్మాణంలో ఉపాధి పథకం కింద 90 రోజులపాటు పనులు చేసుకునేందుకు అనుమతిని కల్పిస్తూ రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ ఇటీవలే ఉత్తర్వులు జారీ చేసింది.
Indiramma Indlu:ప్రస్తుతం ఉపాధి కూలీకి రోజుకు రూ.307 వేతనం చొప్పున ఇస్తున్నారు. 90 రోజులకు గాను వారికి రూ.27,630 వరకు మొత్తంగా ప్రయోజనం కలగనున్నది. దీనిలో భాగంగా బేస్మెంట్ స్థాయి నిర్మాణం వరకు 40 రోజులు, స్లాబు నిర్మాణం వరకు 50 పనిదినాల్లో నిబంధనల మేరకు పనిచేసే అవకాశం ఉంటుంది. దీంతో ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు హర్షం వ్యక్తంచేస్తున్నారు.