Indira canteen: తెలంగాణ ప్రభుత్వం సామాన్య ప్రజల కోసం మరో ప్రజాసేవా కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు సిద్ధమైంది. త్వరలోనే ప్రారంభించబోయే ఇందిరమ్మ క్యాంటీన్లు ద్వారా కేవలం రూ.5కి అల్పాహారం అందించనుంది. మిగిలిన రూ.14 వ్యయాన్ని ప్రభుత్వం భరిస్తుంది. ఒక్క టిఫిన్‌కు మొత్తం ఖర్చు రూ.19 కాగా, పేద, మధ్యతరగతి వర్గాలపై ఆర్థిక భారం పడకుండా ఈ పథకాన్ని రూపొందించారు.
మెనూ సిద్ధం చేసిన GHMC:
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) ఇందిరమ్మ క్యాంటీన్ల కోసం ప్రత్యేకమైన అల్పాహార మెనూను సిద్ధం చేసింది. ఆరోగ్యకరమైన, పోషకాహారంతో కూడిన మిల్లెట్ ఆహారానికి ప్రాధాన్యత ఇచ్చారు. హరే కృష్ణ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ పథకం అమలు కానుంది. రోజుకో రకంగా ఈ క్రింది విధంగా మెనూ ఉండనుంది:
రోజు 1: మిల్లెట్ ఇడ్లీ (3), సాంబార్, చట్నీ / పొడి
రోజు 2: మిల్లెట్ ఉప్మా, సాంబార్, మిక్స్ చట్నీ
రోజు 3: పొంగల్, సాంబార్, చట్నీ
రోజు 4: ఇడ్లీ (3), సాంబార్, చట్నీ
రోజు 5: పొంగల్, సాంబార్, చట్నీ
రోజు 6: పూరీ (3), ఆలూ కూర్మా
పౌష్టికాహార పరిమాణాలు ఖచ్చితంగా:
ప్రతి టిఫిన్‌లో సరిపోయేలా పదార్థాల పరిమాణాలు ఖచ్చితంగా నిర్ణయించారు. ఉదాహరణకు:
మిల్లెట్ ఇడ్లీ – ఒక్కటి 45 గ్రాములు
సాంబార్ – 150 గ్రాములు
చట్నీ – 15 గ్రాములు
139 ప్రాంతాల్లో కొత్త క్యాంటీన్లు:
ఈ పథకాన్ని విజయవంతంగా అమలు చేయడానికి GHMC 139 ప్రాంతాల్లో కొత్త కంటైనర్లను ఏర్పాటు చేస్తోంది. ఇందుకోసం రూ.11.43 కోట్ల వ్యయం చేయనుంది. ప్రతి క్యాంటీన్ పరిశుభ్రత, నాణ్యత ప్రమాణాలతో పనిచేయనుంది.