Nepal Protest: నేపాల్లో జెన్‌జెడ్ పేరుతో కొనసాగుతున్న ఆందోళనలు మరింత తీవ్రమవుతున్నాయి. ఈ ఉద్రిక్త పరిస్థితులు స్థానికులతో పాటు అక్కడి పర్యాటకులకు కూడా తలనొప్పిగా మారాయి. తాజాగా, నేపాల్‌లో చిక్కుకున్న ఓ భారతీయ మహిళ సోషల్ మీడియా వేదికగా సహాయం కోరుతూ వీడియో పోస్ట్ చేయడం సంచలనంగా మారింది.
ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్ అవుతున్న ఆ వీడియోలో ఉపాసన గిల్ అనే భారతీయ యువతి తన పరిస్థితిని కన్నీరుమున్నీరుగా వివరించింది. “నేను వాలీబాల్ లీగ్ కోసం నేపాల్‌కి వచ్చాను. ఉన్న హోటల్‌ను దుండగులు తగలబెట్టారు. నా పాస్‌పోర్ట్, డబ్బులు, బ్యాగులు అన్నీ హోటల్‌లోనే ఉన్నాయి. స్పాలో ఉన్న సమయంలో కొంతమంది కర్రలతో నన్ను దాడి చేయడానికి వచ్చారు. ఏదో విధంగా ప్రాణాలతో బయటపడ్డాను,” అని ఆమె వివరించారు.
ఇది కూడా చదవండి: Nara Lokesh: మంత్రి నారా లోకేష్ అనంతపురం పర్యటన రద్దు
ఆమెతో పాటు మరికొందరు భారతీయులు కూడా చిక్కుకుపోయినట్లు తెలిపి, ఈ వీడియోని భారత ఎంబసీకి పంపించి తమను కాపాడాలని కోరింది. అదేవిధంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ, విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్‌లను ట్యాగ్ చేస్తూ అత్యవసర సహాయం అందించాలని విజ్ఞప్తి చేసింది.
నేపాల్‌లో కొనసాగుతున్న ఈ ఆందోళనల వల్ల సాధారణ జీవనం స్తంభించిపోయింది. పర్యాటకులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. భారత ప్రభుత్వం దీనిపై స్పందిస్తుందేమో చూడాలి.
View this post on Instagram