Australia: ఆస్ట్రేలియాలో మరోసారి జాత్యహంకార దాడి చర్చనీయాంశంగా మారింది. దక్షిణ ఆస్ట్రేలియాలోని అడిలైడ్‌లో ఓ భారతీయ విద్యార్థిపై దారుణంగా దాడి జరిగిన ఘటన దేశవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తోంది.
ఎలా జరిగింది ఈ ఘటన?
ఈ నెల 19న భారత్‌కు చెందిన చరణ్‌ప్రీత్ సింగ్ తన భార్యతో కలిసి బయటకు వెళ్లాడు. వారు కారును ఓ పక్కన పార్క్ చేసి నడుస్తుండగా, ఐదుగురు వ్యక్తులు మరో వాహనంలో అక్కడికి వచ్చారు. కారు పార్కింగ్ విషయంలో మొదలైన వాగ్వాదం క్షణాల్లోనే హింసాత్మకంగా మారింది.
దుండగులు “నువ్వు భారతీయుడివి” అంటూ జాత్యహంకార వ్యాఖ్యలు చేస్తూ, పదునైన ఆయుధాలతో చరణ్‌పై దాడి చేశారు. ఈ దాడిలో చరణ్ ముఖం, వెనక భాగాల్లో తీవ్ర గాయాలయ్యాయి. రక్తస్రావంతో అపస్మారక స్థితిలోకి వెళ్లిన అతడిని స్థానికులు ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన చికిత్స పొందుతున్నారు.
ఇది కూడా చదవండి: Peddi Reddy: మిథున్ రెడ్డితో మాజీ మంత్రి పెద్దిరెడ్డి ములాఖత్
ప్రత్యక్ష సాక్షులు, వీడియోలు వైరల్
ఘటనను గమనించిన ఓ వ్యక్తి వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయడంతో, అది త్వరగా వైరల్ అయింది. ప్రత్యక్ష సాక్షుల ప్రకారం, కారు పార్కింగ్ విషయమే ఈ వివాదానికి కారణమని తెలుస్తోంది.
పోలీసులు, అధికారుల చర్యలు
దాడి తర్వాత చరణ్ భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. 20 ఏళ్ల దుండగుడిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా మిగిలిన దుండగుల కోసం గాలింపు కొనసాగుతోంది.
ప్రీమియర్ ఖండన
దక్షిణ ఆస్ట్రేలియా ప్రీమియర్ పీటర్ మాలినాస్కస్ ఈ ఘటనను తీవ్రంగా ఖండించారు. “ఇలాంటి జాత్యహంకార దాడులు అస్సలు సహించం. ఇది ఆస్ట్రేలియాలో జరగకూడని వ్యవహారం” అని ఆయన స్పష్టం చేశారు.
ऑस्ट्रेलिया के एडिलेड में चरणजीत सिंह नाम के एक भारतीय पर नस्लीय हमला। बुरी तरह मारा। pic.twitter.com/aSu1NV0qbf
— Narendra Nath Mishra (@iamnarendranath) July 23, 2025

