Delhi Air Pollution: సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ వివరాల ప్రకారం ఢిల్లీ ఏవరేజ్ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అంటే AQI గురువారం 371 వద్ద నమోదైంది. ఇది బుధవారం AQI- 419 కంటే కొంచెం బెటర్ గానే ఉంది. కానీ, ఇప్పటికీ దేశంలో అత్యంత కాలుష్య నగరాల్లో ఢిల్లీ రెండో స్థానంలో ఉంది. ఇక్కడ వాయుకాలుష్యం తీవ్రతను దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం ఉద్యోగుల కోసం వేర్వేరు సమయాల్లో పనిచేయాలని ప్రకటించింది. దీంతో పాటు కార్ పూల్ చేసి ప్రజా రవాణాను వినియోగించుకోవాలని ఆదేశాలు జారీ చేశారు.
ఇది కూడా చదవండి: Donthi Madhava Reddy: సీఎం పర్యటనకు దూరంగా నర్సంపేట ఎమ్మెల్యే
Delhi Air Pollution: కేంద్ర ప్రభుత్వ ఆదేశాల తర్వాత, ఇప్పుడు ప్రభుత్వ కార్యాలయాలు ఉదయం 9 నుండి సాయంత్రం 5:30 వరకు లేదా ఉదయం 10 నుండి సాయంత్రం 6:30 వరకు పని చేయవచ్చు. దీనికి ముందు, ఢిల్లీ ప్రభుత్వం, ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ కూడా తమ కార్యాలయాల సమయాన్ని మార్చుకున్నాయి. అదే సమయంలో, NMDC కాలుష్యాన్ని నియంత్రించే ప్రయత్నాలలో భాగంగా నైట్ క్లీనింగ్ డ్రైవ్‌ను ప్రారంభించింది. ఇందులోభాగంగా పలు ప్రాంతాల్లో రాత్రి వేళల్లో పారిశుధ్య కార్మికులు శుభ్రం చేస్తూ కనిపించారు.