AAP First List: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల అభ్యర్థుల తొలి జాబితాను ఆమ్ ఆద్మీ పార్టీ విడుదల చేసింది. లిస్ట్ లో 11 మంది పేర్లు ఉన్నాయి. వీరిలో బీజేపీ, కాంగ్రెస్ నుంచి ఆప్‌లో చేరిన ఆరుగురు నేతలు ఉన్నారు. బ్రహ్మ్ సింగ్ తన్వర్, బీబీ త్యాగి, అనిల్ ఝా ఇటీవలే బీజేపీని వీడారు. కాగా, కాంగ్రెస్ నుంచి జుబేర్ చౌదరి, వీర్ సింగ్ ధింగన్, సుమేష్ షౌకీన్ ఆప్‌లోకి వచ్చారు.
ప్రస్తుత ఢిల్లీ అసెంబ్లీ పదవీకాలం 23 ఫిబ్రవరి 2025తో ముగుస్తుంది. గత అసెంబ్లీ ఎన్నికలు ఫిబ్రవరి 2020లో జరిగాయి. ఈ ఎన్నికల్లో AAP సంపూర్ణ మెజారిటీ సాధించింది. మొత్తం 70 సీట్లలో 62 గెలుచుకుని సంచలనం సృష్టించింది ఆప్. బీజేపీ కేవలం 8 స్థానాల్లో విజయం సాధించగా, కాంగ్రెస్ ఖాతా కూడా తెరవలేదు.